Meditation Walk: నడుస్తూనే ధ్యానం ఎలా చేయాలి? లాభాలు ఏంటి?
Meditation Walk: వాకింగ్ మెడిటేషన్‌ను బౌద్ధంలో "కిన్హిన్" అని పిలుస్తారు, దీనికి "సూత్ర వాక్" అని మరో పేరు కూడా ఉంది.

Meditation Walk: మనం ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామాలు ఎంతగానో సహాయపడతాయి, అలాగే ధ్యానం కూడా అంతే ముఖ్యం. పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడం మాత్రమే ధ్యానం అని చాలా మంది భావిస్తారు. అయితే, నడుస్తూ కూడా ధ్యానం చేసే ప్రక్రియ ఉంది, దానినే మెడిటేషన్ వాక్ అంటారు. దీని గురించి తెలుసుకుందాం.
Meditation Walk:
మెడిటేషన్ వాక్ ఎలా చేస్తారు?
వాకింగ్ మెడిటేషన్‌ను బౌద్ధంలో “కిన్హిన్” అని పిలుస్తారు, దీనికి “సూత్ర వాక్” అని మరో పేరు కూడా ఉంది. మెడిటేషన్ వాక్ ఇలా చేస్తారు: ఒక చేతి పిడికిలి బిగించి, మరో చేతితో ఆ పిడికిలిని కప్పాలి. ఆ తర్వాత నెమ్మదిగా, వృత్తాకారంలో క్లాక్‌వైజ్ దిశలో నడుస్తూ ఒక్కో అడుగుకు ఒక బ్రీత్ (శ్వాస) పూర్తి చేయాలి.
మెడిటేషన్ వాక్ ఉపయోగాలు:
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది: మెడిటేషన్ వాక్ చేసేవారిలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది, ముఖ్యంగా పాదాల్లో రక్తం సక్రమంగా సరఫరా అవ్వడంలో ఇది తోడ్పడుతుంది. కాళ్ల అలసట, మొద్దుబారినట్లు అనిపించడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు, శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది.
జీర్ణశక్తి పెరుగుతుంది: ఆహారం తీసుకున్న తర్వాత కాసేపు ప్రశాంతంగా అటూ ఇటూ నడవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ముఖ్యంగా కడుపు నిండా తిన్నప్పుడు ఇలా నడవడం ద్వారా ఆహారం జీర్ణకోశ ప్రాంతంలో సమంగా పంపిణీ అవుతుంది. ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
డిప్రెషన్ తగ్గుతుంది: మెడిటేషన్ వాక్ ప్రక్రియను అనుసరించిన వృద్ధుల్లో డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు చాలా వరకు తగ్గినట్లు గుర్తించారు. అలాగే వారిలో రక్త ప్రసరణ, ఫిట్నెస్ మెరుగవడం గమనించారు. ఇది దాదాపు యువకులు చేసే రోజువారీ వ్యాయామం ఫలితంతో సమానంగా ఉన్నట్లు తేలింది.
మానసిక ప్రశాంతత: ఏదైనా పార్క్ లేదా తోటలో కాసేపు నడుస్తూ ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ కనీసం 15 నిమిషాల పాటు మెడిటేషన్ వాక్ చేసిన వారిలో ఆందోళన, ఒత్తిడి, రక్తపోటు తగ్గినట్లు గుర్తించారు. వీటితో పాటు నిద్ర, సృజనాత్మకత, ప్రశాంతత వంటి వాటినీ మెడిటేషన్ వాక్ మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.