success:మీ విజయానికి ఈ 7 సూత్రాలు పాటించండి..మీ సబ్ కాన్షియస్ మైండ్‌ను కంట్రోల్లో పెట్టుకోండి.
success:జీవితంలో విజయం (success) సాధించాలని అందరూ కోరుకుంటారు, కానీ కొద్దిమందికే అది సాధ్యమవుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ సరిగ్గా పని చేస్తే విజయాన్ని సులభంగా పొందవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు.

success: జీవితంలో విజయం (success) సాధించాలని అందరూ కోరుకుంటారు, కానీ కొద్దిమందికే అది సాధ్యమవుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్(subconscious mind) సరిగ్గా పని చేస్తే విజయాన్ని సులభంగా పొందవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ, గతంలో మీరు సాధించిన విజయాలను తరచుగా గుర్తు చేసుకోవడం విజయానికి పునాది అవుతుంది.
success:
1. మనసును శుద్ధి చేసుకోండి:
మీ మనసులో పేరుకుపోయిన సందేహాలు, భయాలు, ఆందోళనలను తొలగించుకోండి. వీటిని ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల సానుకూల ఆలోచనలు, జీవితంపై ఆశ, ఆనందం పెరుగుతాయి.
2. పోలికలు వద్దు:
మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ బలాలు, బలహీనతలు, అవసరాలు, లక్ష్యాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇవి తెలిసిన తర్వాత ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవాల్సిన అవసరం ఉండదు, తద్వారా ఉన్నతమైన ఆలోచనలు ప్రారంభమవుతాయి.
3. మెడిటేషన్ చేయండి:
మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి, వ్యక్తిగత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మెడిటేషన్ సాధన చేయండి. రోజూ ధ్యానం చేయడం వల్ల మీపై మీకు విశ్వాసం, ధైర్యం పెరుగుతాయి.
4. సక్సెస్ పోస్టర్:
మీ జీవితంలో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు సాధించిన విజయాలను ఒక పోస్టర్‌గా తయారుచేసి మీకు కనిపించే చోట అతికించండి. రన్నింగ్ పోటీలో గెలవడం, స్కాలర్‌షిప్ సాధించడం, కష్టమైన సబ్జెక్ట్‌లో మంచి మార్కులు సాధించడం వంటి సంతోషకరమైన విజయాలతో ఈ పోస్టర్‌ను రూపొందించండి. ఈ పోస్టర్ చూసిన ప్రతిసారీ మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
5. సానుకూల వ్యక్తులతో సావాసం:
మంచి ఆలోచనా ధోరణి ఉన్న వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇది వ్యక్తిగత జీవితంలో ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.
6. లక్ష్యాన్ని విభజించండి (స్ప్లిట్ టార్గెట్):
పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళిక చాలా ముఖ్యం. లక్ష్యాన్ని సులభంగా చేరుకోవడానికి దానిని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఇది రోజువారీ లక్ష్యాలను చేరుకుంటూ, అనుకున్న ప్రధాన లక్ష్యాన్ని సులభంగా సాధించడానికి సహాయపడుతుంది.
7. అలవాట్లను మార్చుకోండి:
ఆరోగ్యకరమైన ఆలోచనలను పెంపొందించుకోవడానికి ధ్యానం, యోగాతో పాటు మంచి ఆహారం, తగినంత నిద్ర వంటి అలవాట్లను అలవర్చుకోండి. ఇది మీ జీవితాన్ని ఆనందిస్తూనే సానుకూలంగా ఉండటానికి తోడ్పడుతుంది.
ఈ ఏడు అలవాట్లనే సూత్రాలుగా భావించి ఫాలో అయితే ఇక మిమ్మల్ని తల దన్నేవారు భూమిమీదే ఉండరు. మీకు మీరే పోటీగా దునియాను దున్నేయొచ్చు. ఎంతమంది సక్సెస్ ఫుల్ పర్సన్స్ మీ చుట్టూ ఉన్నా.. మీరే ప్రత్యేకంగా నిలబడొచ్చు.