Just Lifestyle

Memory Improvement:మతిమరుపు సమస్య బాధిస్తోందా? ..జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి చిట్కాలు..!

Memory Improvement:మారిన జీవన శైలి కారణంగా చాలా మందిలో మతిమరుపు సమస్య తలెత్తుతుంది. సాధారణంగా వయస్సు మీద పడుతున్న కొద్దీ వచ్చే ఈ మతిమరుపు (Forgetfulness) సమస్య కొందరిలో 40 ఏళ్ల నుంచే మొదలవ్వొచ్చు.

Memory Improvement:మారిన జీవన శైలి కారణంగా చాలా మందిలో మతిమరుపు సమస్య తలెత్తుతుంది. సాధారణంగా వయస్సు మీద పడుతున్న కొద్దీ వచ్చే ఈ మతిమరుపు (Forgetfulness) సమస్య కొందరిలో 40 ఏళ్ల నుంచే మొదలవ్వొచ్చు. అయితే మామూలుగా చిన్న చిన్న విషయాలపై మతిమరుపు ఉంటే పర్లేదు, కానీ ఏదైనా విలువైన, ముఖ్యమైన విషయాలపై మతిమరుపు ఉంటే మాత్రం అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇదిలా ఉండగా, కొన్ని రకాల చిట్కాల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడి జ్ఞాపకశక్తి(memory)ని పెంచుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Memory Improvement

1.తగినంత నిద్ర పోవాలి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం లేదా వ్యాపార డెవలప్‌మెంట్ కోసం బాగా కష్టించి పని చేస్తుండడంతో చాలా మంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీని వలన తగినంత నిద్ర లభించడం లేదు. ఇది ఇలానే కొనసాగితే త్వరగా మతిమరుపు బారినపడతారు. కాబట్టి రోజులో కచ్చితంగా ఏడు గంటల నుంచి 8 గంటల పాటు నిద్ర అలవాటు చేసుకోవాలి.

2. సమతుల ఆహారం తీసుకోవాలి: తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. అధిక కొవ్వులు, అధిక కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉండాలి. అంతేకాదు పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఉడికించిన కోడి గుడ్డు, గింజధాన్యాలు నిత్యం మీ ఆహారంలో భాగమయ్యేలా చూసుకోవాలి. అయితే మాంసాహారులైతే మాంసం, చేపలు, కోడి కూర కూడా అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు.

3. ఆల్కహాల్, పొగ మానెయ్యాలి: ఆల్కహాల్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పైగా ఇది మనకు కన్ఫ్యూజన్‌ను పెంచుతుంది. మతిమరుపును కూడా పెంచుతుంది. అలాగే పొగ కూడా మీ మెదడుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ రెండింటికి దూరంగా ఉండాలి.

4. ప్రతిరోజూ వ్యాయామం, శారీరక శ్రమ అవసరం: శరీరానికి శ్రమ లేకుండా రోజును గడిపితే అది మతిమరుపుకు దారితీస్తుంది. అందుకే వ్యాయామం, శారీరక శ్రమ లాంటివి ప్రతిరోజూ చేస్తూ ఉండాలి. దీనికోసం మొదటగా నడక లాంటి తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెట్టి, క్రమంగా ఎక్కువగా శ్రమించండి. కనీసం రోజుకు 30 నిమిషాల నడకతో మీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి.

5. కాసేపు టెన్షన్లను పక్కనపెట్టాలి: మెదడు చురుగ్గా పని చేసేందుకు కాసేపు టెన్షన్లను పక్కనపెట్టాలి. దీనికోసం పుస్తక పఠనం, పజిల్స్, క్లాసికల్ మూవీస్ చూడడం, చిన్న పిల్లలతో గేమ్స్ ఆడడం, ఇలా ఏవైనా ఒత్తిడి లేకుండా కూల్‌గా ఉండేందుకు, మానసికంగా చురుగ్గా ఉండే అలవాట్లను ఎంచుకోవాలి. మొక్కలు, కూరగాయల పెంపకం, జంతువులను పెంచుకోవడం, ప్రకృతితో మమేకమవడం, ట్రావెలింగ్.. ఇలా అనేక వ్యాపకాలతో కూడా మతిమరుపు సమస్యకు క్రమంగా దూరమవ్వొచ్చు.

6. అందరితో కలిసిపోవాలి: కొందరు ఉద్యోగ, వృత్తిగతమైన జీవితంలో బిజీగా ఉండి బంధువులు, స్నేహితులను కూడా పట్టించుకోరు. అది మెదడు పనితీరుకు ఏమాత్రం మంచిది కాదు. తరచూ బంధువులు, స్నేహితులను కలుస్తూ సాంఘిక జీవనానికి దగ్గర కావడం అలవాటు చేసుకుంటే మెదడు(Brain) పనితీరు మెరుగుపడుతుందని తెలుసుకోవాలి.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button