Just Lifestyle

UnsolvedMysteries:సైన్స్‌కు అంతుచిక్కని 5 అంతులేని ప్రశ్నలు ఇవే!

UnsolvedMysteries:మనిషి జ్ఞానం ఎంతగా పెరిగినా, కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానాలు ఇప్పటికీ దొరకడం లేదు. సైన్స్‌కు కూడా అంతుచిక్కని కొన్ని ప్రశ్నలు, రహస్యాలు చాలా ఉన్నాయి.

UnsolvedMysteries: మనిషి జ్ఞానం ఎంతగా పెరిగినా, కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానాలు ఇప్పటికీ దొరకడం లేదు. సైన్స్‌కు కూడా అంతుచిక్కని కొన్ని ప్రశ్నలు, రహస్యాలు చాలా ఉన్నాయి. అందులో కొన్నిటికి గురించి ఇక్కడ చూద్దాం.

UnsolvedMysteries

1. ఏలియన్స్: భూమి మీద మనుషులు ఉన్నట్లే ఇతర గ్రహాల మీద కూడా వేరే ప్రాణులు ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు. మన దేశంలో కూడా కొన్ని సంఘటనల ఆధారంగా గ్రహాంతర వాసులు వచ్చి వెళ్తున్నారనే ప్రచారం ఉంది. అయితే శాస్త్రవేత్తలు కూడా ఏలియన్స్(Aliens) నిజంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా నిరూపించలేకపోయారు.

2. దెయ్యాలు / పునర్జన్మ: తీరని కోరికలతో చనిపోయిన మనిషి దెయ్యం (Ghost) అవుతాడని అంటారు. అంతేకాకుండా చనిపోయిన తర్వాత కచ్చితంగా పునర్జన్మ ఉంటుందని కూడా నమ్ముతారు. వారు చేసిన కర్మలను బట్టి మళ్లీ మనిషిగానో, పశుపక్షాదులుగానో జన్మిస్తారని చెప్తారు. కానీ దీంట్లో ఏది వాస్తవం అనేది సైన్స్ ఇంకా తేల్చలేదు. దెయ్యాలు, పునర్జన్మపై భిన్న వాదనలు ఉన్నాయి.

3. మరణం: పుట్టిన ప్రతి ప్రాణి చనిపోవాల్సిందే. అయితే మనిషిని మరణం నుంచి దూరం చేయడానికి చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మానవుడు మరణం లేకుండా జీవించగలడా అనే ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం లేదు.

4. విశ్వం: మనిషి పుట్టుకకు ముందు విశ్వంలో ఒక విస్ఫోటనం(Origin of Universe) కారణంగా భూమి ఏర్పడింది. ఆ తర్వాత మానవాళి పుట్టింది అని అంటారు. అయితే ఈ విస్ఫోటనం ఎందుకు జరిగింది? అంతకు ముందు విశ్వంలో ఎవరు ఉండేవారు అనే విషయాలను ఎవరూ తేల్చలేదు.

5. కలలు: నిద్రలో కలలు రావడం చాలా సహజం. మనకు ఉండే కోరికలే కలల రూపంలో వస్తాయని ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. కానీ కొన్నిసార్లు మనకు సంబంధం లేని సన్నివేశాలు కూడా కనిపిస్తాయి. అవి ఎందుకు వస్తాయనేది మాత్రం సైన్స్ వివరించలేదు. మనకు వచ్చిన కొన్ని కలలు ఎందుకు మర్చిపోతాం, కొన్ని ఎందుకు గుర్తు పెట్టుకుంటాం అనేది కూడా చెప్పలేదు. డ్రీమ్స్ విషయంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button