Cancer: ఈ ఒక్క పండుతో క్యాన్సర్‌కు చెక్.. లండన్ శాస్త్రవేత్తల పరిశోధనలో రహస్యం ఇదే!
Cancer: ఆహారం , జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Cancer
ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో మన దైనందిన ఆహారంలో ఉండే ఓ చిన్న పండు కీలక పాత్ర పోషిస్తుందని లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. తీపి, పుల్లని రుచి ఉండే ఆ పండు మరేదో కాదు, అదే ద్రాక్ష (Grape).అలాగే ఆహారం , జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ద్రాక్షలో ఉన్న అద్భుత రహస్యం- రెస్వెరాట్రాల్: లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని నెలల క్రితం క్యాన్సర్ అలాగే ద్రాక్షపై విస్తృతమైన పరిశోధన నిర్వహించారు. ఈ అధ్యయనంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న కొంతమంది రోగుల ఆహారంలో ద్రాక్షను చేర్చి, దాని ప్రభావాన్ని నిశితంగా గమనించారు. ఈ పరిశోధన పాజిటివ్ ఫలితాలు ఇవ్వడానికి ప్రధాన కారణం ద్రాక్షలో ఉండే ‘రెస్వెరాట్రాల్’ (Resveratrol) అనే శక్తివంతమైన సహజ సమ్మేళనమే అని తేలింది.

రెస్వెరాట్రాల్ అంటే ఏమిటి అంటే ఇది ఒక రకమైన పాలీఫెనాల్. ఇది ముఖ్యంగా నలుపు మరియు ఎరుపు ద్రాక్ష యొక్క పై చర్మంలో అధిక మొత్తంలో లభిస్తుంది.
క్యాన్సర్(Cancer) నిరోధక లక్షణాలు: ఈ రెస్వెరాట్రాల్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో, అవి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ద్రాక్ష క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా తొలగించకపోయినా, దాని ముప్పును మాత్రం గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.
ద్రాక్షలో రెస్వెరాట్రాల్‌తో పాటు మన శరీరానికి మేలు చేసే అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి:
ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడే సైనికుల్లా పనిచేస్తాయి.
ద్రాక్షలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా శరీరం అంటువ్యాధులు మరియు ఇతర వ్యాధుల నుంచి రక్షించబడుతుంది.
క్యాన్సర్(Cancer) నివారణకు ,మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ద్రాక్షను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.




Hi, how have you been lately?