T20: టీ ట్వంటీ సిరీస్ భారత్ దే.. చివరి మ్యాచ్ వర్షంతో రద్దు
T20: తొలి టీ ట్వంటీ కూడా వర్షంతో రద్దయింది. రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే... తర్వాత వరుసగా మూడు, నాలుగు టీ ట్వంటీల్లో కంగారూలను భారత్ చిత్తుగా ఓడించింది.
T20
ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ (T20)సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఆధిక్యంలో నిలిచిన టీమిండియా చివరి టీ ట్వంటీలోనూ అదరగొట్టాలని భావించింది. అటు ఆసీస్ కూడా సిరీస్ సమం చేయాలన్న పట్టుదలతో కనిపించింది.
అయితే వర్షం కారణంగా చివరి టీ ట్వంటీ రద్దయింది. మ్యాచ్ ఆరంభానికి ముందు వాతవరణం మేఘావృతమై ఉన్నప్పటకీ సమయానికే టాస్ పడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎందుకుంది. భారత్ తుది జట్టులో ఒక మార్పు జరిగింది.
తిలక్ వర్మకు రెస్త్ ఇచ్చి రింకూ సింగ్ ను తీసుకున్నారు. భారీస్కోరు చేయాలన్న లక్ష్యంతో ఓపెనర్లు శుభమన్ గిల్, అభిషేక్ శర్మ ధాటిగా ఆడారు. బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. భారత్ స్కోర్ 52 రన్స్ దగ్గర ఉండగా మ్యాచ్ నిలిచిపోయింది. ముందు విపరీతమైన గాలి వేయడంతో అంపైర్లు ఆటను ఆపేశారు. తర్వాత భారీ వర్షం కురిసింది. మైదానం చిత్తడిగా మారడంతో చాలాసేపు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

దీంతో 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అలాగే ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్ ఓటమి ఎరుగని జట్టుగా తన రికార్డును కొనసాగించింది. గత 17 ఏళ్ళు ఆసీస్ లో భారత్ టీ ట్వంటీ సిరీస్ కోల్పోలేదు. ఈ సిరీస్ లో పరుగుల వరద పారించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ ట్వంటీల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో కెప్టెన్ సూర్యకుమార్ రికార్డును బ్రేక్ చేశాడు. 1000 పరుగులు కంప్లీట్ చేసేందుకు అభిషేక్ శర్మ 528 బంతులు ఆడగా.. సూర్యకుమార్ 573 బంతుల్లో ఆ ఫీట్ అందుకున్నాడు. అటు ఇన్నింగ్స్ ల పరంగా మాత్రం అభిషేక్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ 27 ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు కంప్లీట్ చేస్తే.. అభిషేక్ 28 ఇన్నింగ్స్ లలో ఘనత సాధించాడు.
ఇదిలా ఉంటే తొలి టీ ట్వంటీ (T20)కూడా వర్షంతో రద్దయింది. రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే… తర్వాత వరుసగా మూడు, నాలుగు టీ ట్వంటీల్లో కంగారూలను భారత్ చిత్తుగా ఓడించింది. ఇదిలా టీ ట్వంటీల్లో ఆసీస్ పేలవమైన రికార్డ్ కంటిన్యూ అవుతోంది. గత మూడేళ్ళుగా నాలుగు సిరీస్ లు కోల్పోయింది. 2022లో భారత్, ఇంగ్లాండ్ జట్ట చేతిలో ఓటమి చవిచూసిన ఆసీస్ తర్వాత 2023లోనూ, ఇప్పుడు 2025లోనూ కూడా టీమిండియా చేతిలోనే టీ20 సిరీస్ లు ఓడిపోయింది.




One Comment