BRS: గులాబీ పార్టీకి మరో దెబ్బ.. జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ ఓటమికి కారణాలివే
BRS: మొదటి నుంచి ఈ ఉప ఎన్నిక ఫలితం మీద పార్టీకి ఎక్కడో ఏదో అనుమానం ఉంది. అందుకే పార్టీ అధిష్టానంతో పాటు నేతలు ఎవ్వరు డబ్బులు తీయలేదు.
BRS
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిఆర్ఎస్(BRS) ఓటమికి కారణాలపై చర్చ జరుగుతోంది. సెంటిమెంట్ తో సీటును నిలబెట్టుకుందామనుకున్న గులాబీ పార్టీకి ప్రజలు షాకిచ్చారు. మాగంటి గోపీనాథ్ తో కెసిఆర్ కి, కేటీఆర్ కి ఉన్న అనుబంధం తో ఆయన మరణించాక, జూబ్లీహిల్స్ సీటు ఆయన రెండో భార్య సునీత కు ఇచ్చారు. ఆమె అభ్యర్థిత్వమే బి ఆర్ ఎస్ కి పెద్ద మైనస్ అని పోలిటికల్ వర్గాల టాక్. సునీత పెద్ద మాటకారి కాకపోవడం పెద్ద మైనస్ పాయింట్ గా భావిస్తున్నారు.
ఇప్పటివరకు లోకానికి తెలియని మాగంటి గోపి మొదటి భార్య వివాదం ఈ ఎన్నికల సందర్భంగా… బయటపడింది. దీంతో ఇద్దరు భార్యలు వివాదం కాస్త ఉన్న సెంటిమెంటుని తుడిచి పెట్టేసింది. జూబ్లీహిల్స్ షెడ్యూల్ ప్రకటించిన మొదటి వారంలో అందరూ ఈ ఉపఎన్నిక లో బిఆర్ఎస్ఏ గెలుస్తుంది అనుకున్నారు. సిటీపై బి ఆర్ ఎస్ కి విపరీతమైన పట్టు ఉండడం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 17 అసెంబ్లీ స్థానాలు గెలవడం దీనికి ప్రధాన కారణం. అయితే అధికార పార్టీ వ్యూహం ముందు ఆ పార్టీ దారుణంగా చిత్తయింది.

బి ఆర్ఎస్ (BRS)ప్రచార సారధి కేటీఆర్…. తన ప్రచారం మొత్తం, సీఎం రేవంత్ రెడ్డి నే టార్గెట్ చేశారు. రేవంత్ అవినీతిపైనే విమర్శలు చేసేవారు. జూబ్లీహిల్స్ ఓటర్లు రేవంత్ రెడ్డి పై వచ్చిన అవినీతి ఆరోపణలను, పట్టించుకోలేదు. ప్రచార భారం మొత్తం కేటీఆర్ తన భుజాల మీద పెట్టుకున్నారు. కాంగ్రెస్ లాగా బీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని షేర్ చేసుకోలేదు.
మాగంటి రెండో భార్యగా ఆమెపై నెగిటివ్ ప్రచారం బిఆర్ఎస్ ని దెబ్బతీశాయి. ఇక కేటీఆర్ సర్వే సంస్థలను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి…. ఫేక్ సర్వేలను వదిలారన్న వార్తలు కూడా ప్రభావం చూపించాయి. అన్నింటికంటే ముఖ్యంగా కవిత రూపంలో బిఆర్ఎస్(BRS) విశ్వసనీయతకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో ఆ పార్టీని కవిత బాగా దెబ్బతీశారు. బిఆర్ఎస్ నేతల వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు అనే విషయాన్ని కవిత పదేపదే జనానికి గుర్తు చేస్తూ వెళ్లారు. సొంత చెల్లెలు ఆ పార్టీపై ఇలాంటి ఆరోపణ చేయడం… జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ విజయాలను దెబ్బతీసింది.
కెసిఆర్ అనారోగ్యం పాలవడం, పూర్తిగా ఫామ్ హౌస్ కె పరిమితం కావడంతో టిఆర్ఎస్ కు స్టార్ క్యాంపైనర్ కరువయ్యాడు. కెసిఆర్ ప్రచారం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పలువురు నేతలు చెబుతున్నారు. ఇక ధికార పార్టీతో పోటీపడి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ డబ్బు ఖర్చు పెట్టకపోవడం మరో కారణంగా చెప్పొచ్చు.
మొదటి నుంచి ఈ ఉప ఎన్నిక ఫలితం మీద పార్టీకి ఎక్కడో ఏదో అనుమానం ఉంది. అందుకే పార్టీ అధిష్టానంతో పాటు నేతలు ఎవ్వరు డబ్బులు తీయలేదు. పోలింగ్ కి రెండు రోజులు ముందు డబ్బులు పంచినా కూడా…. అది అంతంత మాత్రమే. డబ్బుల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్ పోల్ మేనేజ్మెంట్ చేసింది. బిఆర్ఎస్ ఓటమికి ఇది కూడా కారణంగా భావిస్తున్నారు.



