life:జీవితాన్ని మార్చే అద్భుత సూత్రాల గురించి తెలుసుకోండి
life: ఆరోగ్యం విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదు. సరైన ఆహారం, ఎక్సర్‌సైజుల ద్వారా మన శరీరాన్ని కాపాడుకోవాలి.
life
ప్రతి మనిషి జీవితం(life)లో సమయమనేది అత్యంత విలువైన సంపద అని తెలుసుకోవాలి. గడిచిన క్షణం ఎప్పటికీ తిరిగి రాదు కాబట్టి, ఏ ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవడమే నిజమైన విజయం అవుతుంది. ఎందుకంటే సమయపాలన పాటించేవారు మాత్రమే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరు.
అదృష్టం ఎప్పుడూ కూడా డైరక్టుగా తలుపు తట్టకపోవచ్చు.. కానీ నిరంతర శ్రమ , చెమట చుక్కలు కచ్చితంగా విజయానికి బాటలు వేస్తాయి. కష్టపడే తత్వం ఉన్నవారు ఎవరైనా సరే ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనక్కి తగ్గరు. ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనతో ఉండటం అలవాటు చేసుకోవాలి.
మనపై మనకు ఉండే నమ్మకం ఉంటేనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రపంచం మనల్ని నమ్మాలని అనుకుంటే ముందు మనల్ని మనం గౌరవించుకోవాలి. ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు కుంగిపోకుండా.. దానిని ఒక పాఠంగా అనుకుని ముందుకు వెళ్లడం నేర్చుకోవాలి. ఈ ప్రయాణంలో సహనమనేది చాలా పెద్ద ఆయుధంలా పనిచేస్తుంది. ఓర్పు ఉన్నవారు ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు.
అలాగే నిజం ఎప్పుడూ శాశ్వతమైనది. అబద్ధం తాత్కాలిక లాభాన్ని ఇచ్చినా , నిజం చెప్పే వ్యక్తిత్వం.. సమాజంలో నిజమైన గౌరవాన్ని పెంచుతుంది. ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని క్షమించగలిగే గుణం ఉంటే..అది మనల్ని మానసిక ఒత్తిడి నుంచి కాపాడుతుంది. ద్వేషం కంటే క్షమ పెద్దదని గుర్తిస్తేనే మనసుకు అసలైన ప్రశాంతత లభిస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాలి.

విద్య అనేది మనిషికి చనిపోయే వరకు తోడుండే నిజమైన ఆస్తి అని అర్ధం చేసుకోవాలి. డబ్బు పోతుంది కానీ జ్ఞానం ఎప్పటికీ పోదు. నాలెడ్జి ఉన్నవారే సొసైటీలో మార్పు తీసుకురాగలరు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే అలవాటు మంచిది. అహంకారం మనల్ని అందరికీ దూరం చేస్తే, వినయం అనేది అందరి హృదయాలను గెలుచుకునేలా చేస్తుందన్న చిన్న విషయాన్ని మర్చిపోకూడదు. మనకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకునే సంస్కారాన్ని పెంచుకోవాలి.
వీటన్నిటితో పాటు ఆరోగ్యం విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదు. సరైన ఆహారం, ఎక్సర్‌సైజుల ద్వారా మన శరీరాన్ని కాపాడుకోవాలి. జీవితం(life)లో క్రమశిక్షణ అనేది ఒక నియమంలా ఉండాలి. బద్ధకాన్ని వదిలి ప్రతిరోజూ చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తేనే పెద్ద రిజల్ట్ దొరికే అవకాశం ఉంటుంది. భయాన్ని జయించే ధైర్యం మనల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. స్వార్థాన్ని వదిలేసి తోటివారికి సేవ చేయడంలోనే నిజమైన మనిషితనం దాగి ఉందన్న విషయాన్ని గ్రహించాలి.



