IPL: చెన్నైకి సంజూ..రాజస్థాన్ కు జడ్డూ,సామ్ కరన్.. స్టార్ ప్లేయర్స్ కు ఫ్రాంచైజీల షాక్
IPL: సంజూ శాంసన్ ను మాత్రం చెన్నై రూ.18 కోట్లకే ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్(IPL)ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన జడేజా తర్వాత 12 సీజన్ల పాటు చెన్నై సూపర్కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు.
IPL
ఐపీఎల్ (IPL)మినీవేలానికి ముందు ట్రేడింగ్ విండో ముగిసింది. ఊహించినట్టుగానే లీగ్ చరిత్ర మరో హిస్టారికల్ డీల్ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ కు వెళ్లిపోయాడు. జడేజాతో పాటు సామ్ కరన్ ను ఇచ్చేసిన సీఎస్కే సంజూ శాంసన్ ను తీసుకుంది.గతంలో చెన్నై జడేజాను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకోగా.. ఇప్పుడు రాజస్థాన్ మాత్రం రూ.14 కోట్లే చెల్లించనుంది.
సంజూ శాంసన్ ను మాత్రం చెన్నై రూ.18 కోట్లకే ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్(IPL)ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన జడేజా తర్వాత 12 సీజన్ల పాటు చెన్నై సూపర్కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. అటు 2014లో అరంగేట్రం చేసిన సంజూ శాంసన్ రెండు సీజన్లు (2016,2017) ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు మిగిలిన 11 సీజన్లు రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. అలాగే సామ్ కరన్ ను రాయల్స్ రూ.2.4 కోట్లకు ట్రేడ్ చేసుకుంది. 27 ఏళ్ల ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ కు ఐపీఎల్(IPL)లో ఇది మూడో ఫ్రాంచైజీ.
అలాగే ట్రేడింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ మహ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్ కు ఇచ్చేసింది. 119 మ్యాచ్ లు ఆడిన షమీ గత సీజన్ లో నిరాశపరిచాడు. అలాగే లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ముంబై ఇండియన్స్ కు తిరిగి వచ్చేశాడు. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై నుంచి లక్నో ఫ్రాంచైజీకి ట్రేడ్ అయ్యాడు. రాజస్థాన్ జట్టులో ఉన్న నితీశ్ రాణా వచ్చే సీజన్ నుంచి ఢిల్లీకి ఆడబోతున్నాడు.

మరోవైపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిలీజ్, రిటెన్షన్ ప్లేయర్స్ జాబితాలను ప్రకటించాయి. అందరూ అనుకున్నట్టుగానే గత సీజన్ లో నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు పాకిచ్చాయి. మాక్స్ వెల్, లివింగ్ స్టోన్, ఆండ్రూ రస్సెల్, హనరంగ, పతిరణ వంటి విదేశీ స్టార్స్ తో పాటు విజయ్ శంకర్, రాహుల్ త్రిపాటీ, మయాంక్ అగర్వాల్. వెంకటేశ్ అయ్యర్, ఆకాశ్ దీప్ వంటి స్వదేశీ ప్లేయర్స్ ను వేలంలోకి వదిలేసాయి. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న వేలంలో తమ దగ్గరున్న మొత్తంతో ఖాళీలను భర్తీ చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే తాము వదిలేసిన ప్లేయర్స్ ను దక్కించుకునే అవకాశముంది.
ఫ్రాంచైజీల వారీగా రిలీజ్ చేసిన ప్లేయర్స్:
- చెన్నై : పతిరన, త్రిపాఠీ, వన్డే బేడి, సిద్దార్థ్, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేశ్ నాగర్ కోటి
- ముంబై : సత్యనారాణయ రాజు, టాప్లీ, షీర్జీత్, కరణ్ శర్మ, బెవాన్ జాకబ్స్, ముజీబుర్, లిజాడ్ విలియమ్స్, విజ్జేశ్ పుతుర్
- హైదరాబాద్ : అభినవ్ మనోహర్, అధర్వ త్రైడే, సచిన్ బేబీ, వియాన్ ముల్లర్, సిమర్ , రాహుల్ చాహర్, ఆదమ్ జంపా
- బెంగళూరు: స్వస్తిక్ చికారా, మయాంక్ అగర్వాల్, సిఫర్డ్, లివింగ్స్ స్టన్, మనోజ్ ఖార్గే, ఎంగిడి, ముజారబానీ, మోహిత్ రాఠీ
- పంజాబ్: జోస్ ఇంగ్లీస్, ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, మాక్స్ వెల్, ప్రవీణ్ దూబే
- ఢిల్లీ: డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, సెథిఖుల్లా, మన్వంత్ కుమార్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ
- గుజరాత్: మహిపాల్ లామ్రోర్, కరీమ్ జనత్, శనక, కొయెర్జీ, కుట్రోలియా
- లక్నో : ఆర్యన్ జుయల్, మిల్లర్, యువరాజ్ చౌదరి, హంగర్గేకర్, ఆకాశ్ దీప్, రవి బిష్ణోయ్,
- లక్నో : ఆర్యన్ జుయల్, మిల్లర్, యువరాజ్ చౌదరి, హంగర్గేకర్, ఆకాశ్ దీప్, రవి బిష్ణోయ్, షుమర్ జోసెఫ్
- రాజస్థాన్ : హసరంగ, తీక్షణ, ఫజల్ హక్ ఫారూఖీ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, కునాల్ రాథోడ్, అశోక్ వర్మ
- కోల్ కత్తా: రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, డికాక్, నోకియా, మొయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్, సిసోడియా, చేతన్ సకారియా, గుర్బాజ్



