Political: కనిపించని విపక్ష కూటమి నేతలు.. బిహార్ లో ప్రతిపక్షం పాత్రకు పీకే రెడీ
Political: తాజాగా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో స్వయం ఉపాధి పథకాల కింద మహిళలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు ఇస్తామన్న హామీని నితీశ్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Political
బిహార్ ఎన్నిక(Political)ల్లో ఎన్టీఏ కూటమి ఘనవిజయం తర్వాత విపక్ష కూటమి నేతలు సైలెంట్ అయిపోయారు. రాహుల్ గాంధీ అయితే కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసి కామ్ గా ఉన్నారు. ఇక లోకల్ లీడర్ తేజస్వి యాదవ్ , మిగిలిన ప్రధాన నేతలంతా కూడా కనిపించడం లేదు. తేజస్పీ యాదవ్ తన కుటుంబంలో వివాదాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధమవుతున్నారు.
తన పార్టీ(Political) ఓటమికి బాధ్యత వహిస్తూ మౌనదీక్ష చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. నవంబర్ 20న గాంధీ భీతిహర్వా ఆశ్రమంలో ఒకరోజు మౌన ఉపవాస దీక్ష చేయనున్నారు. జన్ సురాజ్ పార్టీ ఓటమిపై పోస్ట్ మార్టమ్ కూడా జరిపిన పీకే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కూడా మైనస్ గా మారిందన్నారు. ఇదిలా ఉంటే ఇక నిత్యం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రశాంత్ కిషోర్ నితీశ్ ప్రభుత్వానికి సవాళ్లు విరుసుతున్నాడు.
తాజాగా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో స్వయం ఉపాధి పథకాల కింద మహిళలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు ఇస్తామన్న హామీని నితీశ్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ హామీ నెరవేరిస్తా తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. అంతే కాదు బిహాల్ వదిలి వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు, అదే సమయంలో ఎన్నికలకు ముందు పీకే చేసిన పలు కామెంట్స్ పై పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో జేడీయూకి 25 కంటే ఎక్కువ సీట్లు వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రశాంత్ కిషోర్ చేసి వ్యాఖ్యలు గురించే ప్రశ్నించగా… ఆయన తోసిపుచ్చారు. తాను రాజీనామా చేయాల్సిన పదవి ఏదైనా ఉంటే చెప్పండి అంటూ దాటవేశారు. తాను ప్రజల కోసం మాట్లాడడం మానేస్తానని మాత్రం ఎప్పటికీ చెప్పనని స్పష్టం చేశారు. ఇటీవలే జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నిక(Political)ల్లో పీకే స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 200కు పైగా స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోటా గెలవలేదు.
ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఓట్లు సాధించడంలో తాను ఫెయిలయ్యానని చెప్పారు. తాను బిహార్ విడిచి వెళ్ళనని, భవిష్యత్తులో ఖచ్చితంగా తమ పార్టీ గెలుస్తుందని పీకే చెప్పుకొచ్చారు.
నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. భారీ హామీలు, డబ్బులు పంచడం ద్వారా గెలిచిందని ఆరోపించారు. అదే సమయంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ల చోరీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే జాతీయ పార్టీలన్నీ కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా 6 నెలల్లో మహిళల ఖాతాల్లో 2 లక్షలు జమ చేయకపోతే జన్ సూరజ్ పార్టీ పోరాటానికి దిగుతుందని ప్రశాంత్ కిషోర్ హెచ్చరించారు.



