Just LifestyleLatest News

Gen Z :ఎంజాయ్ మెంట్ కాదు ఫిట్నెస్‌కే జెన్ Z ఓటు.. ఈ సడన్ చేంజ్‌కు కారణం ఏంటి?

Gen Z : ఒకప్పుడు యూత్ అంటే.. ఖాళీ దొరికితే పబ్బులు, పార్టీలు, లగ్జరీ ట్రిప్పులు, మిడ్ నైట్ ఎంజాయ్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారు.

Gen Z

కొత్త జనరేషన్‌లో మిలీనియల్స్ తరం వారసత్వాన్ని స్వీకరిస్తున్న జెన్ Z (1997-2012 మధ్య జన్మించినవారు) లైఫ్ స్టైల్‌లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంటోంది. ఒకప్పుడు యూత్ అంటే.. ఖాళీ దొరికితే పబ్బులు, పార్టీలు, లగ్జరీ ట్రిప్పులు, మిడ్ నైట్ ఎంజాయ్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే, ప్రస్తుత Gen Z ఈ ఆలోచనా సరళిని పూర్తిగా తిరగరాస్తోంది. వారి ఫోకస్ ఇప్పుడు కేవలం ‘ఎంజాయ్‌మెంట్’ (వినోదం) పై కాకుండా, ఎన్‌హాన్స్‌మెంట్ (స్వీయ అభివృద్ధి) , ఫిట్‌నెస్ పై కేంద్రీకృతమై ఉంది.

ఈ మార్పు కేవలం తాత్కాలిక ట్రెండ్ కాదని, వారి జీవన విధానంలోనే అంతర్లీనంగా వచ్చిన వైఖరి అని గాలబ్, మానిటరింగ్ ది ఫ్యూచర్ వంటి ప్రఖ్యాత అధ్యయనాలు ధృవీకరిస్తున్నాయి.

జెన్ Z(Gen Z) లో కనిపిస్తున్న అత్యంత కీలకమైన మార్పు ఏమిటంటే, ఆల్కహాల్ , ఇతర విచ్చలవిడి వినోదాల నుంచి వారు దూరంగా ఉండటం. ‘నైట్ అవుట్’ బదులు ‘మార్నింగ్ రన్’కి ప్రాధాన్యత ఇవ్వడం వారి నూతన మంత్రంగా మారింది.

వీకెండ్‌లో ఆల్కహాల్ పానీయాల (డ్రింక్స్) కోసం ఖర్చు పెట్టే బదులు, పోషకాలు నిండిన ప్రోటీన్ షేక్స్‌పై, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే స్మూతీస్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఇది కేవలం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు మాత్రమే కాదు, తమ శారీరక లక్ష్యాలను (Fitness Goals) సాధించాలనే నిబద్ధతను తెలియజేస్తుందంటున్నారు నిపుణులు.

ఇప్సోస్ మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 18–34 ఏళ్ల మధ్య వయస్కులలో దాదాపు 50% మంది యువత ఇకపై ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గిస్తామని లేదా పూర్తిగా మానేస్తామని ప్లాన్స్ చేసుకుంటున్నారు. పాత తరాలతో పోలిస్తే, Gen Z లో ఆల్కహాల్ వినియోగం అత్యంత కనిష్ట స్థాయిలో ఉంది. వారు ‘సోబర్ క్యూరియస్’ (Sobriety Curiosity) అనే కొత్త భావనను స్వీకరిస్తున్నారు.

Gen Z
Gen Z

జెన్ Z (Gen Z)ఆరోగ్యాన్ని కేవలం శారీరక శ్రమగా మాత్రమే చూడకుండా, మెంటల్ వెల్నెస్ ను కూడా జోడించి, ఒక ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్‌గా మార్చుకోవాలని చూస్తున్నారు.

ఒక ఫిట్‌నెస్ డేటా ప్రకారం, 73 శాతం మంది Gen Z యువకులు జిమ్, యోగా లేదా హెల్త్ క్లబ్‌లకు క్రమం తప్పకుండా వెళ్తున్నారు. బార్‌లో ఒక గంట గడపడం కంటే, 57 శాతం మంది యువత జిమ్‌లో వర్కౌట్ చేయడాన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారని మరో సర్వే వెల్లడించింది.

వీరు ఫిట్‌నెస్‌ను ఒక ఖర్చుగా కాకుండా, తమ భవిష్యత్తుపై చేసే ముఖ్యమైన పెట్టుబడి (Investment) గా భావిస్తున్నారు. యోగా, ధ్యానం (Meditation), మైండ్‌ఫుల్‌నెస్ వంటి పద్ధతులను పాటించడం ద్వారా సోషల్ మీడియా ఒత్తిళ్లు, చదువు లేదా ఉద్యోగ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందుతున్నారు.

జిమ్‌లు, ఫిట్‌నెస్ స్టూడియోలు వారికి కొత్త సామాజిక వేదికలు (Social Hubs) గా మారాయి. వినోద భరితమైన పబ్బుల కంటే, ఉమ్మడి ఆరోగ్య లక్ష్యాలు ఉన్నవారితో కలిసి మెలిసి ఉండటాన్ని వారు ఆనందిస్తున్నారు

ఈ విప్లవాత్మక మార్పు కేవలం యాదృచ్చికం కాదు, దీని వెనుక కొన్ని ముఖ్యమైన సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల యువత డబ్బును విలాసవంతమైన పబ్బులు, పార్టీల కోసం వృథా చేయకుండా, తమ భవిష్యత్తు కోసం, ఆరోగ్యం కోసం పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారు.

గత తరం కంటే Gen Z మానసిక ఆరోగ్యం పట్ల ఎక్కువ స్పృహ కలిగి ఉన్నారు. ఆల్కహాల్ , నిద్ర లేమి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని గుర్తించి, వాటికి దూరంగా ఉంటున్నారు.

సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల కలిగే ప్రయోజనాలు, నిపుణుల సలహాలు నిరంతరం అందుబాటులో ఉండటం వలన, యువతలో అవగాహన పెరిగింది.

వీరు తక్షణ సంతృప్తి (Instant Gratification) కంటే దీర్ఘకాలిక శ్రేయస్సు (Long-term Well-being) పై దృష్టి సారిస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే కెరీర్‌లో, జీవితంలో విజయం సాధించగలమనే బలమైన నమ్మకం వీరిలో ఉంది.

జెన్ Z (Gen Z)తీసుకొస్తున్న ఈ మార్పు కేవలం ఒక వ్యక్తిగత ఎంపిక మాత్రమే కాదు. ఇది సమాజాన్ని ఆరోగ్యవంతమైన దిశగా నడిపించే ఒక సాంస్కృతిక మార్పుగానే చూడాలి. హ్యాపీనెస్ అనేది టెంపరరీ ఎంజాయ్‌మెంట్‌లో కాకుండా, ఆరోగ్యకరమైన, సంతృప్తకరమైన లైఫ్ స్టైల్‌లోనే ఉందని ఈ తరం యూత్ ప్రూవ్ చేస్తోంది.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button