Emotional Sensitivity: మగ, ఆడవారిలో మానసిక సున్నితత్వం ఎలా ఉంటుంది? ఎమోషనల్ సపోర్ట్ ఎవరికి అవసరం?
Emotional Sensitivity: ఆడవారిలో హార్మోన్ల హెచ్చుతగ్గులు మూడ్ స్వింగ్స్, ఆందోళనపై ప్రభావం చూపుతాయి. మగవాళ్లు కుటుంబ పోషణ, బాధ్యత యొక్క అధిక ఒత్తిడి కారణంగా బలహీనపడతారు.
Emotional Sensitivity
మానసిక బలం లేదా బలహీనత(Emotional Sensitivity) అనేది ఏ ఒక్క లింగానికి (Gender) సంబంధించిన విషయం కాదు, అది మనిషిగా ఒత్తిడిని, జీవిత సవాళ్లను ఎదుర్కొనే విధానంపై ఆధారపడి ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురవడం అనేది మగవారు, ఆడవారు ఇద్దరికీ సహజమే, కానీ దాన్ని వారు వ్యక్తం చేసే తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది.
సైకాలజీ ప్రకారం, ఆడవాళ్లు తమ భావోద్వేగాలను (Emotional Sensitivity)బహిరంగంగా, సులభంగా వ్యక్తం చేస్తారు;=, ఉదాహరణకు, ఏడవడం, బాధను ఇతరులతో పంచుకోవడం అనేది వారిలో సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందుకే వారు ఒత్తిడికి లోనైనప్పుడు ఇతరులతో మాట్లాడటానికి ఇష్టపడతారు. వారిలో డిప్రెషన్ (Depression), ఆందోళన (Anxiety) వంటివి ఎక్కువగా నిర్ధారణ అవుతుంటాయి.
మరోవైపు, మగవాళ్లు తమ భావోద్వేగాలను (Emotional Sensitivity)లోపల అణచిపెట్టడానికి లేదా దాచిపెట్టడానికి సామాజికంగా నేర్చుకుంటారు. ‘మగాడివి బలంగా ఉండాలి’, ‘ఏడవకూడదు’ అనే సామాజిక కట్టుబాట్లు (Toxic Masculinity) వల్లో ఏమో కానీ, వారు తమ బలహీనతను చూపించడానికి భయపడతారు. దీనివల్ల వారిలో కోపం, దూకుడు (Aggression), ఆల్కహాల్ వంటి వ్యసనాలకు (Addictions) లోనవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీరిలో మానసిక సమస్యలు ఆలస్యంగా లేదా తప్పుగా నిర్ధారణ అయ్యే ప్రమాదం ఉంది.

మగవాళ్లు, ఆడవాళ్లు ఎందుకు బలహీనపడతారు అనే ప్రశ్నకు సమాధానం హార్మోన్ల ప్రభావం, సామాజిక కట్టుబాట్లు, జీవితంలోని పెద్ద సంఘటనలే కారణం. ముఖ్యంగా ఆడవారిలో హార్మోన్ల హెచ్చుతగ్గులు మూడ్ స్వింగ్స్, ఆందోళనపై ప్రభావం చూపుతాయి. మగవాళ్లు కుటుంబ పోషణ, బాధ్యత యొక్క అధిక ఒత్తిడి కారణంగా బలహీనపడతారు. ఇక జీవితంలోని పెద్ద సవాళ్లు, అంటే ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక సమస్యలు, విడాకులు లేదా ప్రియమైన వారిని కోల్పోవడం వంటి వాటిని ఎదుర్కోవడంలో ఇద్దరూ మానసికంగా కుంగిపోతారు.
మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు మగవారు ప్రధానంగా తమ భావోద్వేగాలను లోపల అణచివేస్తారు, ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. వారి సమస్యను ఎదుర్కోవడానికి వ్యసనాలకు, లేదా ప్రమాదకరమైన ప్రవర్తనలకు లోనవుతారు. సహాయం కోసం అడగడానికి కూడా చాలామంది మగవారు వెనుకాడతారు, ఎందుకంటే థెరపిస్ట్ను కలవడాన్ని వారు తమ బలహీనతగా భావిస్తారు. అదే సమయంలో, ఆడవాళ్లు తమ బాధను ఏడవడం ద్వారా, లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా సులభంగా వ్యక్తం చేస్తారు. వారు కౌన్సిలర్ లేదా థెరపిస్ట్ సహాయం తీసుకోవడానికి సిగ్గు పడరు.
అయితే, ఆ సమయంలో ఎమోషనల్ సపోర్ట్ కావాలి అనుకోవడానికి కారణం ఒకటే – సమస్యకు ప్రామాణికత (Validation) ,ఏకాంతం నుంచి విముక్తి. ఎమోషనల్ సపోర్ట్ అనేది ‘నేను ఈ సమస్యను ఒక్కడినే ఎదుర్కోవట్లేదు, నాకు అండగా ఒకరు ఉన్నారు’ అనే భద్రతా భావాన్ని ఇస్తుంది. మనసులోని భారాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది . ఇతరులు భిన్నమైన పరిష్కార మార్గాలను సూచించగలరు. ఈ సపోర్ట్ ద్వారా ఒక వ్యక్తి తనకు తానే పరిష్కారాన్ని కనుగొనేందుకు శక్తి లభిస్తుంది.
ఈ మానసిక బలహీనత లేదా ఒత్తిడిని సరిగ్గా నిర్వహించకపోతే వచ్చే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి దీర్ఘకాలిక మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. అంతేకాకుండా, నిద్రలేమి, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు వంటి శారీరక సమస్యలు కూడా పెరుగుతాయి. మగవారిలో, అణచివేయబడిన బాధ , సహాయం కోరడానికి నిరాకరించడం చివరికి ఆత్మహత్యా ప్రయత్నాలు లేదా హింసాత్మక చర్యలకు దారితీయొచ్చు. ఈ మానసిక సమస్యలు పనితీరును, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధాలను కూడా దెబ్బతీస్తాయి.
సైకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం, మగవాళ్లలో, ఆడవాళ్లలో ఒత్తిడి, ఆందోళన ఒకే విధంగా ఉన్నా కూడా, దాన్ని బయటకు చూపించే విధానం సమాజం పెట్టిన కట్టుబాట్ల వల్ల మారుతుంది. అందుకే వారు మగవాళ్లను ఏడవడానికి లేదా తమ భావోద్వేగాల(Emotional Sensitivity)ను పంచుకోవడానికి ప్రోత్సహించాలని, అదేవిధంగా ఆడవారిని వారి భావోద్వేగాల గురించి విమర్శించకుండా వారికి మద్దతు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన భావాలను అణచివేయకుండా, ఆరోగ్యకరమైన పద్ధతిలో వ్యక్తపరుస్తాడో (Healthy Expression), అప్పుడే వారు మానసికంగా బలంగా ఉంటారు.




Galera do Brasil, F12Bet Brasil is where I place my bets! They have good odds and a decent selection of games. Vale a pena conferir em f12betbrasil, eu garanto!
R86com, not bad! Just tried it out and I’m liking the selection. Seems legit and easy to navigate. Definitely adding this to my bookmarks. Check it out here: r86com
Hey folks, been using betisrealbetis for a while now. Their odds are pretty competitive, and the site is smooth. Definitely worth a look-see for your next bet. Find them here: betisrealbetis