Dekh Lenge Saala:దేఖ్ లేంగే సాలా ప్రోమోకు క్రేజీ రెస్పాన్స్ ..ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ ఊర మాస్ డ్యాన్స్
Dekh Lenge Saala: ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి తాజాగా ఒక సంచలన అప్‌డేట్ విడుదలైంది. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Dekh Lenge Saala
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగిస్తూ, ఆయన రాబోయే లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి తాజాగా ఒక సంచలన అప్‌డేట్ విడుదలైంది. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి కారణం, ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే కావడం. అంతేకాకుండా, ‘ఓజీ’ లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్ తాజాగా ‘దేఖ్ లేంగే సాలా'(Dekh Lenge Saala) అనే స్టైలిష్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన ఈ పాట బీట్ ఒక రేంజ్‌లో ఉండగా, పవన్ కళ్యాణ్ స్టైల్, ఎనర్జిటిక్ డ్యాన్స్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఈ రేంజ్‌లో డాన్స్ స్టెప్స్ వేయడం పట్ల ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రోమో చూస్తుంటేనే, ఈ సాంగ్ సోషల్ మీడియాలో మరియు థియేటర్లలో భారీ స్థాయిలో షేక్ చేయడం ఖాయమని అర్థమవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా హీరోయిన్స్ శ్రీలీల, రాశి ఖన్నా పవన్ పక్కన ఎంటర్టైన్ చేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో వస్తున్న ఈ మూవీ 2026 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ప్రోమోనే ఈ స్థాయిలో క్రేజ్‌ను సృష్టిస్తే, దేఖ్ లేంగే సాలా (Dekh Lenge Saala) పాట పూర్తిగా (ఫుల్ సాంగ్) ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 13న ఈ ఫుల్ సాంగ్ విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండగ లాంటి అప్‌డేట్.



