Just International

South Korea : సౌత్ కొరియాలో నయా ట్రెండ్..మతం నుంచి ‘డిస్‌కనెక్ట్’ అవుతున్న యూత్

South Korea: దక్షిణ కొరియా (South Korea) పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి హైటెక్ గ్యాడ్జెట్‌లు, బ్లాక్‌పింక్, కే-డ్రామాలు, ఇంకా ఫ్యూచరిస్టిక్ సిటీస్.

South Korea: దక్షిణ కొరియా (South Korea) పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి హైటెక్ గ్యాడ్జెట్‌లు, బ్లాక్‌పింక్, కే-డ్రామాలు, ఇంకా ఫ్యూచరిస్టిక్ సిటీస్. ఒకప్పుడు సంప్రదాయాలకు, మత విశ్వాసాలకు పెద్ద పీట వేసిన ఈ దేశం.. ఇప్పుడు ఊహించని విధంగా ఒక సోషల్ రెవల్యూషన్‌కు సాక్షిగా నిలుస్తోంది. టెక్నాలజీ వేగంతో దూసుకుపోతున్న ఈ సమయంలో, దశాబ్దాల సంస్కృతి, ఆర్థికాభివృద్ధి వల్ల మెల్లమెల్లగా దక్షిణ కొరియా ఒక లౌకిక సమాజంగా రూపుదిద్దుకుంటోంది.

South Korea:

హైటెక్ హబ్‌లో హైడెన్ స్పిరిచువాలిటీ..

ఐదు దశాబ్దాలుగా, దక్షిణ కొరియా (South Korea) యుద్ధ విధ్వంసం నుంచి బయటపడి, గ్లోబల్ టెక్ పవర్ హౌస్‌గా అవతరించింది. ఈ అద్భుతమైన ప్రయాణంలో, వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో పాటు డిజిటల్ లైఫ్‌స్టైల్ ప్రజల ఆలోచనా సరళిని పూర్తిగా మార్చేశాయి. యూత్ ఇప్పుడు రిలిజియస్ రిచువల్స్ కంటే రీజనింగ్, లాజిక్, రియాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. వాళ్ల ఫోకస్ అంతా ఎడ్యుకేషన్, కెరీర్, ఫైనాన్షియల్ స్టేబిలిటీ మీదే ఉంటోంది.

2024 డేటా షాకింగ్ రిజల్ట్స్ వెల్లడిస్తోంది. దక్షిణ కొరియా జనాభాలో దాదాపు 60 శాతం మందికి ఎటువంటి మతపరమైన కట్టుబాట్లు లేవు. మిగిలిన వారిలో 31 శాతం మంది క్రైస్తవం వీరిలో 20% ప్రొటెస్టంట్లు, 11% కాథలిక్కులు ఉండగా, 17 శాతం మంది బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు. ఈ గణాంకాలు చూస్తుంటే, సౌత్ కొరియన్లు ‘సెక్యులర్ వైబ్’ వైపు అడుగులు వేస్తున్నారని అర్థమవుతోంది.

స్కాండల్ షాక్.. ట్రస్ట్ కోల్పోయిన మత సంస్థలు

మత సంస్థలపై ప్రజల నమ్మకం సన్నగిల్లడానికి కొన్ని పెద్ద సంఘటనలు కారణమయ్యాయి. షిన్చియోంజి చర్చ్ కోవిడ్ కనెక్షన్ (2020): కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో, షిన్చియోంజి చర్చ్ వైరస్ సమాచారాన్ని దాచిపెట్టిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. ఈ సంఘటన మత సంస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని మరింత దెబ్బతీసింది.

ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ & ఫేవరెటిజం: ప్రొటెస్టంట్ మెగా చర్చీలలో జరిగిన పన్ను ఎగవేతలు, ఆర్థిక కుంభకోణాలు, మరియు లైంగిక వేధింపుల ఆరోపణలు మత నాయకుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి. దీంతో చాలా మంది స్పిరిచువాలిటీని రిలీజియన్ నుంచి సపరేట్‌గా చూడటం మొదలుపెట్టారు.

టెంపుల్స్ టు టూరిస్ట్ స్పాట్స్: బౌద్ధ ఆలయాలు క్రమంగా ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి కమర్షియల్ టూరిస్ట్ స్పాట్స్‌గా మారిపోవడం, వాటి ఆధ్యాత్మిక విలువను తగ్గించడమే కాకుండా ప్రజలను మతం నుంచి దూరం చేసింది.

పొలిటికల్ పవర్ ప్లే.. మతం నుంచి బయటపడ్డ రాజకీయం

1980లు, 90లలో కిమ్ యంగ్ సామ్, కిమ్ డే జంగ్ వంటి క్రైస్తవ నాయకుల రాజకీయ ప్రాబల్యం, మత సంస్థలను పొలిటికల్ పార్టీలతో ముడిపెట్టింది. చర్చిలు రాజకీయ ప్రచారాలకు ఫండింగ్ చేయడం, ఓటు బ్యాంకుల కోసం లాబీయింగ్ చేయడం వంటివి ప్రజల్లో మత సంస్థలపై అసంతృప్తిని పెంచాయి. అయితే, దక్షిణ కొరియా ప్రజాస్వామ్యం రిలీజియన్ మరియు పాలిటిక్స్ మధ్య ఒక క్లియర్ డివైడింగ్ లైన్ గీసుకోగలిగింది.

ఈ లౌకిక విధానం ఆసియాలో జపాన్, నార్త్ కొరియా వంటి దేశాలతో పోలిస్తే దక్షిణ కొరియాను ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది. జపాన్‌లో మతపరమైన ఆచారాలు ఇంకా బలంగా ఉండగా, నార్త్ కొరియా నిరంకుశ నాస్తికత్వాన్ని (Atheism) పాటిస్తోంది. కానీ సౌత్ కొరియా మాత్రం మత స్వేచ్ఛను బ్యాన్ చేయకుండా, దాన్ని పూర్తిగా వ్యక్తిగత ఎంపిక (Religious Freedom)గా వదిలేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సోషల్ డైనమిక్స్‌కు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button