Bedwetting: పిల్లలకు పక్క తడిపే అలవాటుంటే ఏం చేయాలి?
Bedwetting: రాత్రిపూట మూత్రాన్ని తగ్గించే హార్మోన్ (ADH- యాంటీడైయూరెటిక్ హార్మోన్) సరిగా విడుదల కాకపోవడం.
Bedwetting
సుమతికి తొమ్మిదేళ్లు. ఆమె చాలా చురుకైన పిల్ల, బడిలో ముందుంటుంది, ఆటల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటుంది. కానీ, నిద్రలో సుమతికి పక్క తడిపే(Bedwetting) అలవాటుంది.
సుమతి ప్రతి ఉదయం పక్క తడిచి (Bedwetting)ఉండటం చూసి చాలా బాధపడేది. “నా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఇలా చేయరు కదా, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను?” అని అనుకునేది. ముఖ్యంగా, ఎప్పుడైనా బంధువుల ఇంటికి వెళ్లాలన్నా, లేక తన ఫ్రెండ్‌తో కలిసి రాత్రి ఉండాలన్నా సుమతి భయపడేది.
ఒకరోజు, సుమతి పుట్టినరోజు వేడుకకు తన క్లాస్‌మేట్స్ అందరూ వచ్చారు. రాత్రి కొంతమంది స్నేహితులు అక్కడే ఉండాలని అనుకున్నారు. సుమతి గుండె వేగంగా కొట్టుకుంది. ఈ(Bedwetting) రహస్యం బయటపడితే తనను చూసి అందరూ నవ్వుతారేమో అని భయపడింది.
సుమతిని గమనించి ఆమె తల్లి శారద, పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది. “అమ్మూ, నాకు తెలుసు నువ్వు దేని గురించి భయపడుతున్నావో. ఇది చాలా మంది పిల్లలకు ఉండే సాధారణ విషయం. ఇది నీ తప్పు కాదు, అనారోగ్యం అసలే కాదు,” అని నెమ్మదిగా చెప్పింది. “నిజానికి, కొంతమంది పిల్లలలో రాత్రిపూట మూత్రాశయాన్ని నియంత్రించే భాగం నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. దీనికి కారణం హార్మోన్ల లోపం కావచ్చు లేదా గాఢ నిద్రలో ఉండటం కావచ్చు. నువ్వు కంగారు పడకు.”

శారద ఆ రాత్రి సుమతికి ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేసింది. “పక్క తడపడం అనేది నీ నియంత్రణలో లేదు, కాబట్టి దాని గురించి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. “పడుకునే ముందు మనం ఏం చేయాలి? ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగకుండా, తప్పకుండా టాయిలెట్‌కి వెళ్లి రావాలి.”
ఆ రాత్రి సుమతి స్నేహితులతో చాలా సంతోషంగా గడిపింది. పడుకునే ముందు శారద సుమతికి ఒక వాటర్‌ప్రూఫ్ మ్యాట్ వేసి, ప్రత్యేక లోపలి దుస్తులు (Bedwetting Underwear) కూడా ఇచ్చింది.
అలారం పెట్టుకుని సుమతి లేచి టాయిలెట్‌కి వెళ్లి మళ్లీ పడుకుంది. ఆ రాత్రి ఆమె పక్క తడపలేదు! ఈ విజయం ఆమెలో కొత్త ధైర్యాన్ని నింపింది.
తరువాత కొద్ది నెలల పాటు, అలారం టెక్నిక్ పాటిస్తూ, పగటిపూట ఎక్కువగా నీళ్లు తాగుతూ, రాత్రిపూట తగ్గించడం నేర్చుకుంది. మెల్లమెల్లగా, అలారం లేకుండానే రాత్రిపూట తన మూత్రాశయాన్ని నియంత్రించడం సుమతికి అలవాటైంది. ఒక సంవత్సరం తర్వాత, ఆమె ఆ అలవాటును పూర్తిగా వదిలించుకుంది.
పక్క తడిపే అలవాటును ప్రేమ, ఓర్పు , సరైన పద్ధతులతో జయించవచ్చు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, చిరునవ్వు, ఓదార్పు , ప్రోత్సాహం దీనిని ఎదుర్కోవడంలో చాలా ముఖ్యమైనవి.

పక్క తడిపే(Bedwetting) అలవాటుకు కారణాలు:
కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ.మూత్రాశయం పరిమాణం చిన్నగా ఉండటం లేదా రాత్రిపూట దానిని పూర్తిగా నియంత్రించలేకపోవడం.
రాత్రిపూట మూత్రాన్ని తగ్గించే హార్మోన్ (ADH- యాంటీడైయూరెటిక్ హార్మోన్) సరిగా విడుదల కాకపోవడం. పిల్లలు అతిగా గాఢ నిద్రలో ఉండటం వలన, మూత్రాశయం నిండిన సంకేతాలను మెదడు గుర్తించలేకపోవడం.
పెద్ద పేగు నిండి ఉండటం మూత్రాశయంపై ఒత్తిడి కలిగించి, పక్క తడపడానికి కారణం కావచ్చు.మానసిక ఒత్తిడి (Emotional Stress) ,ఇంట్లో మార్పులు, స్కూల్లో ఒత్తిడి లేదా భయం.
తల్లిదండ్రుల పిల్లలను ఎప్పుడూ కోప్పడకండి, శిక్షించకండి లేదా అవమానించకండి. ఇది వారి ఆందోళనను పెంచుతుంది. పక్క తడపకుండా ఉన్న ప్రతి ఉదయం వారిని అభినందించండి. చిన్న విజయాలను కూడా గుర్తించండి.
సాయంత్రం 4 గంటల తర్వాత లేదా పడుకోవడానికి 2 గంటల ముందు పాలు, నీరు, జ్యూస్‌లు వంటి ద్రవ పదార్థాలను పరిమితం చేయండి.
నిద్రకు ముందు ఒకసారి, ఆ తరువాత 15 నిమిషాల వ్యవధిలో మరోసారి టాయిలెట్‌కి వెళ్లేలా ప్రోత్సహించండి. 5-7 సంవత్సరాల వయస్సు దాటినా కూడా అలవాటు కొనసాగితే, డాక్టర్‌ను సంప్రదించి, హార్మోన్ల సమస్య లేదా ఇతర వైద్య కారణాలు లేవని నిర్ధారించుకోండి.



