Phone full: మీ ఫోన్ నిండా అనవసరమైన డేటా ఉందా? జాగ్రత్త!
Phone full: భవిష్యత్తులో ఈ ఫోటో లేదా ఈ ఫైల్ అవసరమవుతుందేమో అని దాన్ని డిలీట్ చేయకుండా దాచుకుంటారు.
Phone full
మనం సాధారణంగా ఇంట్లో పాత వస్తువులు, పనికిరాని సామాన్లు పేరుకుపోతే దాన్ని ‘హోర్డింగ్’ అంటాం. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో అంతకంటే ప్రమాదకరమైన ‘డిజిటల్ హోర్డింగ్’ అనే సమస్య మొదలైంది. వేలకొద్దీ అనవసరమైన ఫోటోలు, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు, ఎప్పుడో డౌన్లోడ్ చేసి మర్చిపోయిన పిడిఎఫ్ ఫైల్స్, పనికిరాని ఈమెయిల్స్(phone full).. ఇలా డిజిటల్ పరికరాల్లో డేటాను పేరుకుపోయేలా చేయడమే డిజిటల్ హోర్డింగ్.
ఇది కేవలం మీ ఫోన్ లేదా కంప్యూటర్ స్టోరేజ్(phone full)ని మాత్రమే కాదు, మీ మెదడు ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఫిజికల్ వస్తువులైతే కళ్లకు కనిపిస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాం, కానీ డిజిటల్ డేటా కళ్ళకు కనిపించదు కాబట్టి దీనివల్ల కలిగే ఒత్తిడిని మనం గుర్తించలేకపోతున్నాం.
చాలా మందిలో ఒక భయం ఉంటుంది.. భవిష్యత్తులో ఈ ఫోటో లేదా ఈ ఫైల్ అవసరమవుతుందేమో అని దాన్ని డిలీట్ చేయకుండా దాచుకుంటారు. దీన్నే ‘జస్ట్ ఇన్ కేస్’ మెంటాలిటీ అంటారు. కానీ వాస్తవానికి ఆ డేటాలో 90 శాతం మనకు ఎప్పటికీ అవసరం రాదు. ఇలా డేటా పేరుకుపోవడం వల్ల మన మెదడులో ఒక రకమైన గందరగోళం మొదలవుతుంది.
మీ ఫోన్ గ్యాలరీ తెరిచినప్పుడు వేలకొద్దీ ఫోటోలు కనిపిస్తే, అందులో మీకు కావాల్సిన ఒక్క ఫోటోను వెతకడానికి మీ మెదడు చాలా శ్రమించాల్సి వస్తుంది. ఇది తెలియకుండానే మీలో నిర్ణయాలు తీసుకునే శక్తిని తగ్గిస్తుంది , ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందని నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా మనలో ఒక రకమైన ఆందోళన (Anxiety) కలుగుతుంది.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే ‘డిజిటల్ డీటాక్స్’ , ‘డిజిటల్ క్లీనింగ్’ చాలా అవసరం. ప్రతి వారం లేదా నెలకు ఒకసారి కనీసం ఒక గంట సమయం కేటాయించి అవసరం లేని గ్రూప్ ఫోటోలు, స్క్రీన్ షాట్లు , డూప్లికేట్ ఫైల్స్ డిలీట్ చేయాలి. వాట్సాప్‌లో వచ్చే పనికిరాని మీడియా ఫైల్స్‌ను ఆటో-డౌన్లోడ్ కాకుండా సెట్టింగ్స్ మార్చుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో మనం ఫాలో అవుతున్న అకౌంట్స్ మనకు ఉపయోగపడకపోతే వాటిని అన్‌ఫాలో చేయడం కూడా ఒక రకమైన క్లీనింగ్ కిందకే వస్తుంది. మీ డిజిటల్ స్పేస్ ఎంత ఖాళీగా, క్రమ పద్ధతిలో ఉంటే మీ ఆలోచనలు కూడా అంత స్పష్టంగా ఉంటాయి.
డిజిటల్ హోర్డింగ్ అనేది కేవలం టెక్నాలజీ సమస్య కాదు, అది ఒక మానసిక స్థితి. మీ ఫోన్‌ను క్లీన్ చేసుకోవడం అంటే మీ మెదడును రిలాక్స్ చేసుకోవడమే. అనవసరమైన సమాచారాన్ని వదిలించుకున్నప్పుడే కొత్త విషయాలకు, సృజనాత్మక ఆలోచనలకు మన మెదడులో చోటు దొరుకుతుంది. అందుకే ఈ రోజు నుంచే మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో పనికిరాని డేటాను డిలీట్ చేయడం మొదలుపెట్టండి. ఆ ప్రక్రియలో మీకు కలిగే తేలికపాటి అనుభూతిని మీరే గమనిస్తారు.



