Just Literature

Literature: చరమగీతం

Literature: చరమగీతం

Literature:

అతడు ఇక్కడే నడిచాడు
అతడు ఇక్కడే పరిగెత్తాడు
ఇప్పుడతని పాదాలు నేలను తాకలేవు…
వందల పాదాలు అతని కోసం
చివరి అడుగులు వేస్తున్నాయి!

అతడిక్కడే జ్ఞాపకాలు పోగేశాడు
అతడిక్కడే బంధాలను పెనవేశాడు
ఇప్పుడవన్నీ ఇక్కడే వదిలేశాడు.
ఇక్కడ నిలిచిన మనుషులు
అతని జ్ఞాపకాలను ఏరుకుంటున్నారు!

అతడిక్కడే ఆశలు నాటాడు
ఆశయాల రెక్కలతో పైకి ఎగిరాడు
ఇప్పుడతని చివరి గమ్యం చేరాడు..
ఆ ఆశలు ఊసులుగా మారిపోయి
కొన్ని రోజులు కబుర్లు చెప్పుకుంటాయి!

అతడిక్కడే ప్రేమలు కురిపించాడు
అతడిక్కడే ద్వేషం రగిలించాడు
ఇప్పుడన్నిటికీ అతీతుడయ్యాడు..
ఇప్పుడతని అడుగు జాడలు
శిధిలమవ్వడానికి సిద్ధమవుతున్నాయి!

అతడి జీవితాన్ని ఎప్పుడూ జీవించలేదు
కాలాన్ని కాగితపునోట్లగా మార్చుతూ
దేహాన్ని దీపపు ఒత్తిలా కరిగించి
సంతోషాలను సుదీరతీరాలలోకి నెట్టాడు
ఇప్పుడతడు శూన్యమైపోయాడు

కాల ప్రవాహంలో బిందువయ్యాడు
శుష్క భూమిలో రేణువయ్యాడు
అతడి కోసం ఏ ఒక్కటి ఆగిపోలేదు
అతడెవరో?
ఎక్కడున్నాడో?
లేక మనలోనే దాక్కున్నాడో..!

–ఫణి మండల
8555988435

16 Comments

  1. మీరు వ్రాసిన ఈ కవిత నామిత్రుని మొత్తం జీవితం కళ్ళముందు కదిలి కన్నీళ్లు నా కళ్ళను నింపేసాయి. హృదయాన్ని కదిలించిన కవిత. మీనుంచి మరిన్ని కవితలు రావాలని ఆశగా ఎదురుచూస్తుంట.

  2. చరమగీతం చాలా అద్భుతంగా ఉంది.
    లిఖించిన పని మంటలు గారికి అభినందనలు.
    మీ నుంచి మరిన్ని కవితలు ఆశిస్తున్నాను

  3. వై ప్రశంస లో రెండో వరుసలో పని మంటలు గారికి బదులుగా ఫణి మండల గారికి అని చదువుకోగలరు. పొరపాటుకు క్షంతవ్యులం.

  4. ఫణి మీరు రాసిన కవిత అద్భుతం ఒక జీవితం ముగిసిపోయిన తర్వాత ఆ జీవి యొక్క జీవితం శూన్యం…. కళ్ళని చామర్చేలా ఉంది మీ వర్ణన.

  5. చాలా బాగుంది. బ్రో సినిమా లో చెప్పినట్లు మనం నిమిత్త మాతృలం.జరగాల్సింది జరిగిపోతుంది. చూస్తూ ఉండటమే.

  6. ఆశల తీరాన
    ఆడుకుంటూ
    మోహపు పాశాన
    వేలాడుకుంటూ
    అటు చూసినా
    ఇటు చూసినా
    ఎటు చూసినా
    మన చుట్టూతా
    ఉన్నాడతడు
    పాక్కుంటూ
    దే క్కుంటూ
    అప్పుడప్పుడు
    నీలో నాలో
    మనందరి
    మదిలో
    దాక్కుంటూ
    తిరుగుతున్నాడు
    అంతటా అతడు
    లోక సంచారి యై

  7. Prathi manishiki sink ayye la vunnai lines anni naku ayithe sink ayipoyayi…… Bava👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button