Gold prices: బిగ్ షాక్ ఇచ్చిన బంగారం.. ఆల్టైమ్ హైకి చేరిన ధరలు. .
Gold prices: బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే దారిలో వెళ్తూ ఆల్టైమ్ రికార్డును సృష్టించింది.
Gold prices
బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకు చేదు కబురే అని చెప్పాలి. కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడతాయని ఎదురుచూస్తున్న సామాన్యుడి ఆశలపై నీళ్లు చల్లుతూ, బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 24 క్యారెట్ల బంగారం ధర(Gold prices) తులం (10 గ్రాములు) లక్షా నలభై వేల రూపాయల మార్కును దాటేసింది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే దారిలో వెళ్తూ ఆల్టైమ్ రికార్డును సృష్టించింది.
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలు, యుద్ధ మేఘాలు , పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించి బంగారంపై భారీగా పెట్టుబడులు పెట్టడమే ఈ ధరల పెరుగుదలకు మెయిన్ రీజన్ అని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. రాబోయే 2026 ఏడాదిలో కూడా ఈ గోల్డ్ షాక్ తప్పదని, ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ , విజయవాడలలో ధరలు (Gold prices)ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 1,40,030 ఉండగా..22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 1,28,360 ఉంది. ఇక వెండి (1 కేజీ) రూ. 2,54,100గాఉంది.
విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతుండగా, చెన్నైలో వెండి ధరలు మిగిలిన నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,40,630 గా ఉండగా, వెండి ధర రూ. 2,54,100 గా ఉంది. ఢిల్లీలో ప్యూర్ గోల్డ్ (24K) ధర రూ. 1,40,180 గా నమోదైంది. ముంబై , కోల్కతాలో 24 క్యారెట్ల ధర రూ. 1,40,030 గా కొనసాగుతోంది.
ఈ ధరలు ఉదయానికి అందిన సమాచారం ప్రకారం మాత్రమే అని కొనుగోలుదారులు గమనించాలి. బంగారం ధరలు షేర్ మార్కెట్ లాగే ప్రతి నిమిషం మారుతుంటాయి. అంతేకాకుండా, ఇక్కడ ఇచ్చిన ధరలకు జిఎస్టి (GST), తయారీ కూలి (Making Charges) అదనంగా ఉంటాయి. కాబట్టి నగలు కొనేముందు మీ ఊర్లోని జువెలరీ షాపులో ప్రత్యక్ష ధరలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో ఇలా ధరలు పెరగడం మధ్యతరగతి కుటుంబాలకు పెను భారంగా మారింది. బంగారం ధరలు తగ్గుతాయని ఎదురుచూడాలా లేక ఇప్పుడే కొనేయాలా అన్న సందిగ్ధంలో సామాన్యులు ఉన్నారు. కానీ నిపుణుల అంచనా ప్రకారం, ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, అవసరం ఉన్నవారు ఇప్పుడే కొనడం మంచిదని సలహా ఇస్తున్నారు.



