Just NationalJust International

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాక్కున్నాం.. అసలు సంగతి చెప్పిన పాక్ ప్రెసిడెంట్

Operation Sindoor: ఈ విషయాన్ని పాక్ అధ్యక్షుడు తాజాగా వెల్లడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాక్ అధ్యక్షుడు అందరినీ బంకర్లలోకి వెళ్లి దాక్కోమని సూచించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

Operation Sindoor

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ పై కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్ కు ఇటీవలే ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) తో మన సత్తా ఏంటనేది తెలిసొచ్చింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆ టైమ్ లో మన భీకర దాడులకు పాకిస్తాన్ లోని రాజకీయ నాయకులు, మంత్రులు ప్యాంట్లు తడుపుకున్నారు.

ఈ విషయాన్ని పాక్ అధ్యక్షుడు తాజాగా వెల్లడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాక్ అధ్యక్షుడు అందరినీ బంకర్లలోకి వెళ్లి దాక్కోమని సూచించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ మొదలవగానే అధికార పార్టీకి చెందిన తమ ముఖ్య నేతలంతా వణికిపోయారని, ప్రాణాలతో బయటపెడతామన్న నమ్మకంగా కూడా కలగలేదన్నారు.

ఇక పాక్ లో సగభాగం నామరూపాలు లేకుండా పోతుందని కూడా భయపడ్డామని చెప్పుకొచ్చారు.
అయితే ఆ తర్వాత ఊహించిన విధంగా పరిణామాలు మారిపోయాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)మరో రెండురోజులు కొనసాగి ఉంటే పాక్ మిగిలేది కాదన్నారు.

Operation Sindoor
Operation Sindoor

జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ప్రకృతి అందాలు వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులపై పాక్ ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ టెర్రర్ ఎటాక్‎లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‎కు తగిన బుద్ధి చెప్పేందుకు ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తో భారత్ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉగ్రవాదుల స్థానాలను లక్ష్యంగా చేసుకొని నేరుగా దాడులు చేసింది. ఈ దాడులలో పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసమయ్యాయి. పలువురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అలాగే పాక్ సైనికులు కూడా పదుల సంఖ్యలో చనిపోయారు.

అయితే భారత్ ఆధిపత్యాన్ని సహించలేని పాకిస్తాన్ తమ సైనికులు ఎవ్వరికీ ఏం కాలేదంటూ ఓవరాక్షన్ చేసింది. అలాగే పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాత్రం కీలక విషయాలను వెల్లడించారు. రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత క్షిపణులు దాడి చేశాయన్నారు. ఈ దాడిలో ఎయిర్ బేస్ దెబ్బతినడంతో పాటు పలువురు సిబ్బంది గాయపడ్డారని అంగీకరించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button