Just SportsLatest News

ICC T20 World Cup: కొత్త ఏడాదిలో నాన్ స్టాప్ క్రికెట్..  తీరికలేని షెడ్యూల్‌తో భారత్

ICC T20 World Cup: ఇప్పుడు అదే జోష్ తో మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బలమైన జట్టునే సెలక్టర్లు ఎంపిక చేయడంతో అంచనాలు రెట్టింపయ్యాయి.

ICC T20 World Cup

భారత క్రికెట్ జట్టు ఎప్పుడూ విరామం లేకుండా వరుస సిరీస్ లు ఆడుతూనే ఉంటుంది. ఇప్పుడు కొత్త ఏడాదిలోనూ భారత క్రికెట్ జట్టు తీరికలేని షెడ్యూల్ తో గడపబోతోంది. సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత మూడు వారాలు విశ్రాంతి దొరకడంతో కాస్త రిలాక్స్ అవుతున్న మన క్రికెటర్లు వచ్చే వారం తర్వాత అస్సలు ఖాళీ లేకుండా క్రికెట్ ఆడనున్నారు. టీమిండియా 2026 షెడ్యూల్ చూస్తే జనవరి 11 నుంచి న్యూజిలాండ్ వైట్బాల్ సిరీస్ కొత్త ఏడాదిలో వాళ్ల క్రికెట్ జర్నీ మొదలుకాబోతోంది.

కివీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20( ICC T20 World Cup)ల సిరీస్ ముగిసిన వారం రోజులకే టీ20 ప్రపంచకప్ ఆడాల్సి ఉంటుంది. ఈ మెగాటోర్నీకి భారత్ శ్రీలంక ఆతిథ్యమిస్తున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ కావడం, సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 2024 టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్లో అసలు భారత్ కు ఎదురే లేకుండా పోయింది.

ఇప్పుడు అదే జోష్ తో మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బలమైన జట్టునే సెలక్టర్లు ఎంపిక చేయడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఉపఖండపు పరిస్థితులను అడ్వాంటేజ్ తీసుకుని టీమిండియా దుమ్మురేపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

_ICC T20 World Cup
_ICC T20 World Cup

టీ20 ప్రపంచకప్( ICC T20 World Cup) ముగిసిన వెంటనే వారం రోజుల వ్యవధిలో భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ తో బిజీ కాబోతున్నారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో స్టేడియాలన్నీ హౌస్ ఫుల్ అయిపోతుంటాయి. దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రతీరోజూ సాయంత్రం టీ20( ICC T20 World Cup) మజాతో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో సిరీస్ ఆడుతుంది. జూలైలో ఇంగ్లాండ్ టూర్ కు వెళుతుంది.

గత ఏడాది ఐదు టెస్టులు ఆడి 2-2తో సమం చేసిన భారత్ ఇంగ్లీష్ గడ్డపై ఈ సారి వైట్ బాల్ సిరీస్ లు ఆడుతుంది. అలాగే ఆగష్టులో భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్ళి రెండు టెస్టులు ఆడుతుంది. అనంతరం వాయిదా పడిన బంగ్లాదేశ్ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. సెప్టెంబర్లో ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్, వెస్టిండీస్ తో సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్ లు షెడ్యూల్లో ఉన్నాయి.

అదే సమయంలో జపాన్ వేదికగా ఆసియాగేమ్స్ జరగబోతున్నాయి. ఆసియాక్రీడల్లో క్రికెట్ కూడా భాగం కావడంతో భారత జట్టు పాల్గొంటుంది. ఇక ఏడాది చివర్లో భారత జట్టు కివీస్ పర్యటనకు వెళుతుంది. న్యూజిలాండ్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ ట్వంటీలు ఆడుతుంది. ఇక డిసెంబర్ లో శ్రీలంకతో జరిగే హోం సిరీస్ 2026లో భారత జట్టు క్రికెట్ సీజన్ కు ఎండ్ కార్డ్ పడుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button