ring finger: బ్లడ్ టెస్ట్‌కు రింగ్ ఫింగరే ఎందుకు..దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి..?
ring finger: మిగిలిన వేళ్లను వదిలేసి ఉంగరపు వేలునే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా?

ring finger : చిన్నవాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ మనలో అందరం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నవాళ్లమే. అయితే ఎప్పుడైనా గమనించారో లేదో కానీ నర్సులు లేదా ల్యాబ్ టెక్నీషియన్లు మీ చేతిలోని ఐదు వేళ్లలోంచి, సరిగ్గా ఉంగరం వేలు (రింగ్ ఫింగర్) నుంచే రక్తాన్ని తీసుకుంటారు. మరీ ఎక్కువ టెస్టులు అప్పుడు కాకుండా ఒకటి, రెండు టెస్టుల కోసం రింగ్ ఫింగర్ నుంచే శాంపిల్ కోసం బ్లడ్ తీసుకుంటారు. మిగిలిన వేళ్లను వదిలేసి, ఈ ఒక్క వేలునే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన, వైద్యపరమైన సీక్రెట్ దాగి ఉందట.
ring finger
వైద్య నిపుణులు చెప్పే దాని ప్రకారం, మన చేతిలోని ఉంగరం వేలు నరం నేరుగా గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది. శరీరంలోని ఇతర వేళ్ల నరాలు ఈ ఉంగరం వేలి నరానికి ఉప-శాఖల వలె మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి. అంటే, రింగ్ ఫింగర్ గుండెకు అత్యంత దగ్గరి, ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల లాభం ఏమిటంటే, గుండె నుంచి ప్రవహించే రక్తం యొక్క తాజా, స్వచ్ఛమైన నమూనా లభిస్తుంది.
గుండె నుంచి నేరుగా వచ్చే రక్తాన్ని పరీక్షించడం ద్వారా, మన శరీర ప్రస్తుత స్థితిని, ఏవైనా అంతర్గత ఆరోగ్య సమస్యలను అత్యంత కచ్చితంగా అంచనా వేయడానికి వీలవుతుంది. అందుకే, రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ వంటి కీలకమైన పరీక్షల కోసం రింగ్ ఫింగర్ నుంచే రక్తాన్ని సేకరిస్తారు. దీనివల్ల టెస్ట్ రిజల్ట్స్ మరింత నమ్మదగినవిగా ఉంటాయి.
మరి మిగిలిన వేళ్లను ఎందుకు వాడరు? అంటే దానికి కూడా స్పష్టమైన కారణాలున్నాయట. బొటన వేలు, చిటికెన వేలుకు అరచేతి లోతైన భాగాలతో ప్రత్యేకమైన కనెక్షన్లు (టెండన్ షీత్లు) ఉంటాయి. వాటి నుంచి రక్తం తీస్తే, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువ. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే, అది అరచేతిలోకి వేగంగా వ్యాపించి తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు.
చూపుడు వేలు, మధ్య వేలును మనం నిత్యం ఏదో ఒక పనికి ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉంటాం. వాటి నుంచి రక్తం తీసినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండొచ్చు, అంతేకాదు, ఆ గాయం త్వరగా మానకపోవచ్చు.
అందుకే, తక్కువ ఇన్ఫెక్షన్ రిస్క్, తక్కువ నొప్పి, గుండెకు ఉన్న డైరక్ట్ కనెక్షన్ వంటి ప్రయోజనాల కోసమే వైద్య నిపుణులు ఎల్లప్పుడూ ఉంగరం వేలుకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ చిన్న శ్రద్ధే.. రోగి భద్రతకు, పరీక్ష ఫలితాల కచ్చితత్వానికి వైద్యులు ఎంత శ్రద్ధ తీసుకుంటారో అర్ధం అయ్యేలా చేస్తుంది. అందుకే, ఉంగరపు వేలికి “విలువైన వేలు” అనే పేరు కూడా వచ్చిందేమో.