Just LifestyleHealthLatest News

Detox Drinks:చలికాలంలో నేచురల్ డిటాక్స్ డ్రింక్స్..ఇంట్లోనే తయారు చేసుకోండి ..

Detox Drinks:చలికాలంలో వేడివేడి కాఫీ, టీలకు బదులుగా ఇలాంటి నేచురల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

Detox Drinks

చలికాలంలో అలాగే చలికాలం ముగిసేముందు వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు అందరినీ వేధిస్తుంటాయి. బయటి వాతావరణం మారినప్పుడు మన శరీరం కూడా దానికి అనుగుణంగా మారాలి. ముఖ్యంగా డిటాక్స్ డ్రింక్స్(Detox Drinks) క్రమం తప్పకుండా తీసుకోవాలి.

శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపించి, లోపలి నుంచి బలంగా మార్చేవే డిటాక్స్ డ్రింక్స్(Detox Drinks). ఇవి కేవలం ఆరోగ్యాన్నే కాకుండా, చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయని నిపుణులు అంటున్నారు.

అద్భుతమైన మూడు డిటాక్స్ డ్రింక్స్ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

మొదటిది అల్లం, తేనె మిశ్రమం- అల్లంలో సహజమైన యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం అల్లం రసం, నచ్చితే రెండు దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ తేనె కలుపుకుని ఉదయాన్నే తాగితే శ్వాసకోస సమస్యలు దరిచేరవు.
రెండోది దాల్చినచెక్క , ఆపిల్ డిటాక్స్ వాటర్- ఒక జార్ నీటిలో ఆపిల్ ముక్కలు, దాల్చినచెక్క స్టిక్స్ వేసి రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఈ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మెటబాలిజం పెరుగుతుంది.
మూడోది పసుపు మరియు మిరియాల పాలు (Golden Milk)- రాత్రి పడుకునే ముందు చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి వేసిన పాలు తాగడం వల్ల శరీరంలోని వాపులు తగ్గి, గాఢమైన నిద్ర పడుతుంది.

Detox Drinks
Detox Drinks

ఈ చలికాలంలో వేడివేడి కాఫీ, టీలకు బదులుగా ఇలాంటి నేచురల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Changur Baba :ఎవరీ చంగూర్ బాబా .. కులాన్ని బట్టి రేటు, విదేశీ ఫండింగ్ ఏంటీ కథ..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button