Just BusinessLatest News

Solopreneurship:ఆఫీస్ వద్దు.. స్టాఫ్ అవసరం లేదు.. ఒక్కరిగానే సంపాదించండి..

Solopreneurship: ఇంట్లో కూర్చుని కూడా ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్‌ను సృష్టించడం ఇప్పుడు సాధ్యమవుతోంది.

Solopreneurship

వ్యాపారం చేయాలి అంటే ఒక పెద్ద ఆఫీసు ఉండాలి. ఎంత కాదనుకున్న పదుల సంఖ్యలో ఎంప్లాయిస్ పని చేయాలి. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. కానీ ఆ రోజులు ఇప్పుడు మారిపోయాయి. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోలోప్రెన్యూర్‌షిప్(Solopreneurship) అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది.

సోలో అంటే ఒక్కరు అని అర్థం. అంటే ఒక వ్యక్తి తన ట్యాలెంట్‌ను , స్మార్ట్‌ఫోన్ కానీ ల్యాప్‌టాప్‌ను కానీ పెట్టుబడిగా పెట్టి, ఒక్కరిగానే ఒక పెద్ద వ్యాపారాన్ని నడపడమే ఈ విధానం. అంటే ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం లేకుండా, తమకు నచ్చిన సమయంలో, నచ్చిన ప్రదేశం నుంచి పనిచేస్తూ లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

సోలోప్రెన్యూర్ అలాగే సాధారణ స్టార్టప్ వ్యవస్థాపకుడికి మధ్య ఒక చిన్న తేడా ఉంది. ఒక స్టార్టప్ మొదలుపెట్టిన వారు ఫ్యూచర్లో దాన్ని ఒక పెద్ద కంపెనీగా మార్చి, వందల మందికి ఉద్యోగాలివ్వాలని టార్గెట్‌గా పెట్టుకుంటారు. కానీ సోలోప్రెన్యూర్ తన పనిలో ఫ్రీడమ్‌ను ఎక్కువగా ప్రేమిస్తాడు. వ్యాపారాన్ని ఎంత పెంచినా తనే బాస్, తనే పనివాడు అనే పద్ధతిలోనే సాగుతాడు.

ఉదాహరణకు, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన జాబ్ వదిలేసి ఫ్రీలాన్స్‌గా పనిచేయడం, ఒక గృహిణి ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్ ఛానెల్ నడపడం లేదా ఆన్‌లైన్‌లో విదేశీ విద్యార్థులకు క్లాసులు చెప్పడం ఇవన్నీ సోలోప్రెన్యూర్‌షిప్(Solopreneurship) కిందే వస్తాయి. ఇక్కడ మేనేజర్లు, ఆఫీస్ పాలిటిక్స్ ఉండవు కాబట్టి పనిపై పూర్తి కంట్రోల్ ఉంటుంది.

ఈ రకమైన వ్యాపారంలో ఖర్చులు చాలా తక్కువగానే ఉంటాయి కాబట్టి వచ్చే లాభం మొత్తం వారికే మిగులుతుంది. కంటెంట్ క్రియేషన్, గ్రాఫిక్ డిజైనింగ్, ఆన్‌లైన్ కోచింగ్, వర్చువల్ అసిస్టెంట్, ఈ-కామర్స్ వంటి రంగాలలో సోలోప్రెన్యూర్లకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. తమ దగ్గర ఉన్న ఒక క్రియేటివిటీని, ఆర్ట్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతారు.

Solopreneurship
Solopreneurship

ఒకప్పుడు కేవలం చదువుకున్న వారికే ఇది పరిమితం. కానీ ఇప్పుడు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. కేవలం ఇంట్లో కూర్చుని కూడా ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్‌ను సృష్టించడం ఇప్పుడు సాధ్యమవుతోంది.

అయితే ఇందులో కొన్నిఛాలెంజెస్ కూడా లేకపోలేదు. మార్కెటింగ్ నుంచి అకౌంట్స్ వరకు అన్ని పనులూ ఒక్కరే చేసుకోవాలి. దీంతో పని భారం ఎక్కువగా అనిపించొచ్చు. సరైన ప్రణాళిక లేకపోతే ఆదాయంలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశముంటుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక పరికరాలు ఇప్పుడు సోలోప్రెన్యూర్లకు ఒక అసిస్టెంట్‌లా సహాయపడుతున్నాయి.

పెద్ద పెద్ద కంపెనీలు చేయాల్సిన పనులను కూడా ఏఐ సహాయంతో ఒకే వ్యక్తి ఈజీగా పూర్తి చేయగలుగుతున్నాడు. రాబోయే రోజుల్లో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, తమను తాము ఒక బ్రాండ్‌గా మార్చుకునే సోలోప్రెన్యూర్ విప్లవం మరిన్ని అద్భుతాలు సృష్టించబోతోంది.

Budget:బడ్జెట్ 2026 సామాన్యుడికి వరం అవుతుందా? భారం మిగులుస్తుందా?

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button