CM Ramesh : బాంబు పేల్చిన సీఎం రమేష్.. కవిత మాటలు నిజమే ..!
CM Ramesh : తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికి మీడియా ముందుకొచ్చిన ఎంపీ సీఎం రమేష్, పొలిటికల్ సర్కిల్స్‌ను షేక్ చేసే కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు

CM Ramesh : బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు రహస్యంగా ప్రయత్నాలు జరిగాయని ఇటీవల ఎమ్మెల్సీ కవిత కామెంట్లను అంతా లైట్ తీసుకున్నారు కానీ..ఇప్పుడు మాటలు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. కానీ, ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్వయంగా రంగంలోకి దిగి, కవిత మాటలకు పక్కా ప్రూఫ్ ఇచ్చినట్లుగా మాట్లాడటం, ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ హై-వొల్టేజ్ పొలిటికల్ డ్రామాగా మార్చింది. ఈ సంచలన బాంబ్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారడమే కాదు, పెను ప్రకంపనలు సృష్టిస్తోంది!
CM Ramesh
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికి మీడియా ముందుకొచ్చిన ఎంపీ సీఎం రమేష్, పొలిటికల్ సర్కిల్స్‌ను షేక్ చేసే కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. కవిత జైల్లో ఉన్నప్పుడు, కేటీఆర్ స్వయంగా ఢిల్లీలో నా ఇంటికి వచ్చారు. కవితను జైలు నుంచి బయటకు తీసుకొస్తే, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేందుకు సిద్ధమని ప్రతిపాదించారు. ఇది నిజమా, కాదా కేటీఆర్ చెప్పాలి?” అని సీఎం రమేష్ సూటిగా ప్రశ్నించారు.
అయితే, బీఆర్ఎస్ను తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించలేదని రమేశ్ స్పష్టం చేశారు. “మీ పార్టీ అవినీతిమయం అయిపోయింది, తెలంగాణలో మీ ఆట కట్టైంది, కాబట్టి మీతో మాకు పొలిటికల్ మైత్రి కుదరదని మా అధిష్టానంతో మాట్లాడి తేల్చి చెప్పా. అందుకే ఇప్పుడు నాపై ఇలాంటి ఫాల్స్ ఆరోపణలు చేస్తున్నావు” అంటూ రమేష్, కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
తెలంగాణలో రిత్విక్ కంపెనీకి రూ. 1660 కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు దక్కడంలో తన పాత్ర ఉందని కేటీఆర్ చేసిన ఆరోపణలను సీఎం రమేష్ బలంగా తిప్పికొట్టారు. “ఆ కంపెనీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై నేను కాంట్రాక్టులు పొందాననడం హాస్యాస్పదం, పచ్చి అబద్ధం” అని ఆయన మండిపడ్డారు. ఎల్ అండ్ టీ, రిత్విక్ కంపెనీలకు ఈ వర్క్ కాంట్రాక్టులు వచ్చి మూడు నెలలు అయిందని గుర్తు చేస్తూ, “పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నీకు, ప్రభుత్వ కాంట్రాక్టులు ఎలా ఇస్తారో తెలియదా?” అని కేటీఆర్‌ను నిలదీశారు.
ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి తన చెల్లెలితో ఎలా అయితే పోరు ఉందో, తెలంగాణలో నీకు కూడా చెల్లెలి పోరుతో మతి భ్రమించి మాట్లాడుతున్నావు” అంటూ సీఎం రమేష్, కేటీఆర్‌పై వ్యక్తిగత దాడికి దిగారు. ఇది రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
టీడీపీతో పొత్తు, లోపలి విషయాలు: “బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేవలం 300 ఓట్ల మెజారిటీతో నువ్వు ఎమ్మెల్యేగా ఎలా గెలిచావో నేను ఇప్పుడు చెప్పమంటావా?” అని రమేష్ కేటీఆర్‌ను ఛాలెంజ్ చేశారు. “తుమ్మల నాగేశ్వరావు లాంటి సీనియర్ లీడర్‌ను మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని నేను నిన్ను అడిగితే, ‘మా పార్టీకి కమ్మవారు అవసరం లేదు, రేవంత్ రెడ్డి గెలిచాక మా పార్టీలోని రెడ్డిలు కూడా రేవంత్ వెనకాల వెళ్లారు, అందుకే ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నాం’ అని నువ్వు నాతో చెప్పావా లేదా?” అంటూ సీఎం రమేష్, కేటీఆర్ అంతర్గత సంభాషణలను బయటపెట్టారు.
“రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ-టీడీపీ పొత్తుతో పనిచేస్తాయని, అప్పుడు టీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవని తెలిసే ఇటువంటి నిరాధారమైన అలిగేషన్స్ చేస్తున్నావు” అని సీఎం రమేష్, బీఆర్ఎస్ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు. అవి ఎవరెవరికి దక్కాయి? అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది? ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్న పూర్తి ఆధారాలు నా దగ్గర పక్కాగా ఉన్నాయి” అని సీఎం రమేష్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. “దమ్ముంటే, నువ్వు చెప్పిన చోటకి రా, మీడియా సమక్షంలోనే బహిరంగ చర్చకు నేను సిద్ధం” అంటూ కేటీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
చివరిగా, కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. అనవసరంగా నన్ను కెలికితే, నీ గురించి ఇంకా చాలా నిజాలు బయటపెట్టాల్సి వస్తుందంటూ సీఎం రమేష్, కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మాటలు తెలంగాణలో వాతావరణాన్ని మరింత హీటెక్కించింది. పార్టీ విలీనం, భారీ కాంట్రాక్టుల ఆరోపణలు, లోపలి విషయాలు, వ్యక్తిగత దాడి.. ఇలా అనేక అంశాలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పొలిటికల్ డిబేట్‌కు దారితీసే అవకాశం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.