Tilak Varma : వార్మప్ లో తిలక్ వర్మ అదుర్స్..యూఎస్ఏపై భారత్ ఏ విక్టరీ
Tilak Varma : తిలక్ వర్మ రీఎంట్రీ మెరుపులు మెరిపించాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతుండగా గాయపడి సర్జరీ తర్వాత కోలుకున్న తిలక్ వర్మ ఇటీవలే బెంగళూరు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ఫిట్ నెస్ సాధించాడు.
Tilak Varma
టీ ట్వంటీ ప్రపంచకప్ ఫీవర్ మొదలైపోయింది. అసలు టోర్నీకి ముందు సన్నాహక మ్యాచ్ లు షురూ అయ్యాయి. టోర్నీలో ఆడుతున్న పలు జట్లు వార్మప్ మ్యాచ్ లతో ప్రాక్టీస్ ను ఆరంభించాయి. ఈ క్రమంలో యూఎస్ఏతో భారత్ ఏ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ జట్టులో వరల్డ్ కప్ ఆడబోతున్న తిలక్ వర్మ(Tilak Varma )కూడా ఉన్నాడు. అలాగే దేశవాళీ క్రికెట్ లో పలువురు యువ ఆటగాళ్లకు కూడా చోటు దక్కింది.
సెలక్టర్ల దృష్టిలో పడాలన్నలక్ష్యంతో భారత్ ఏ జట్టు అదరగొట్టింది. అయితే తిలక్ వర్మ కూడా రీఎంట్రీ మెరుపులు మెరిపించాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతుండగా గాయపడి సర్జరీ తర్వాత కోలుకున్న తిలక్ వర్మ(Tilak Varma )ఇటీవలే బెంగళూరు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ఫిట్ నెస్ సాధించాడు. దీంతో మెగాటోర్నీకి ముందు పూర్తిస్థాయిలో అతను ఫిట్ గా ఉన్నాడా లేదా అన్నది తెలుసుకునేందుకు, ప్రాక్టీస్ కోసం సెలక్టర్లు అమెరికాతో మ్యాచ్ లో బరిలోకి దింపారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఈ హైదరాబాదీ బ్యాటర్ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.
కేవలం 24 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు తన సహజమైన బ్యాటింగ్ తో పూర్తి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఫిట్ నెస్ పరంగానూ, బ్యాటింగ్ పరంగా తిలక్ ఎటువంటి ఇబ్బందీ పడలేదు. అంతేకాదు బౌలింగ్ లోనూ రాణించి ఒక వికెట్ తీశాడు. భారత్ ఏ జట్టును ప్రకటించినప్పుడు తిలక్ వర్మ టీమిండియా క్యాంపులో చేరే ముందు ఒక మ్యాచ్ ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. దీని ప్రకారమే మ్యాచ్ ఆడి టచ్ లోకి వచ్చేశాడు. తిలక్ వర్మ(Tilak Varma )రానుండడంతో సంజూ లేదా ఇషాన్ కిషన్ లలో ఒకరిపై వేటు పడనుంది.

ఇదిలా ఉంటే ఈ వార్మప్ మ్యాచ్ లో జగదీశన్ నారాయణన్ సెంచరీతో దుమ్మురేపాడు. యూఎస్ఏ బౌలర్లపై విరుచుకుపడిన జగదీశన్ 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. అతనితో పాటు ఆయుశ్ బదోని కూడా అదరగొట్టాడు. కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఏ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. ఛేజింగ్ లో యూఎస్ఏ కూడా దూకుడుగానే ఆడింది. ఓపెనర్ గౌస్ 44, సంజయ్ కృష్ణమూర్తి 41 పరుగులతో రాణించారు.
ధాటిగా బ్యాటింగ్ చేసినప్పటకీ యూఎస్ఏ 200 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ ఏ జట్టు తన చివరి వార్మప్ మ్యాచ్ లో శుక్రవారం నమీబియాతో తలపడుతుంది.
Pawan Kalyan:పవన్ క్లాస్ పీకుతున్నా కేడర్ తీరెందుకు మారడం లేదు? ఆ 3 కారణాలతోనే మౌనమా?



