Latest News

T20 World Cup : తుది జట్టు కూర్పుకు చివరి ఛాన్స్..భారత్ , సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్

T20 World Cup : టీ ట్వంటీ వరల్డ్ కప్ మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ అసలు టోర్నీకి ముందు చివరి సన్నాహకంగా వార్మప్ మ్యాచ్ ఆడేందుకు భారత్ రెడీ అయింది.

T20 World Cup

టీ ట్వంటీ వరల్డ్ కప్(T20 World Cup) మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ అసలు టోర్నీకి ముందు చివరి సన్నాహకంగా వార్మప్ మ్యాచ్(Warmup Match) ఆడేందుకు భారత్ రెడీ అయింది. సఫారీ జట్టుతో తలపడనున్న టీమిండియా తుది జట్టు కూర్పును చివరిసారి పరీక్షించుకోనుంది. ఈ మ్యాచ్ తోనైనా ఓపెనర్ సంజూ శాంసన్ ఫామ్ అందుకుంటాడా ? బౌలర్లు పూర్తిగా గాడిన పడతారా ? ఈ మ్యాచ్‌ల ద్వారా ఆటగాళ్ల ఫామ్, కాంబినేషన్లను టీమిండియా మేనేజ్‌మెంట్ పరీక్షించనుంది.

గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్(T20 World Cup) ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడగా, భారత్ విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు మళ్లీ అదే ప్రత్యర్థితో వార్మప్ మ్యాచ్ జరుగుతుండటంతో ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.రోహిత్ శర్మ టీ20ల నుంచి రిటైర్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు ఓ బలమైన శక్తిగా ఎదిగింది.

ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టీ20(T20) సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న భారత్.. అదే ఊపును ఈ మెగా టోర్నీలోనూ కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే  వంటి యువ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఈ వార్మప్ మ్యాచ్ ద్వారా తుది జట్టులో ఉన్న చిన్నపాటి లోపాలను సరిదిద్దుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.

ముఖ్యంగా సంజూ శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. కివీస్ తో సిరీస్ ఆద్యంతం సంజూ ఫ్లాప్ అయ్యాడు.ఈ క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన అవకాశాలను సంజూ అందిపుచ్చుకోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పిస్తారన్న అభిప్రాయం మొదలయ్యింది.

T20 World Cup
T20 World Cup

దీంతో చివరి సన్నాహకంగా ఈ వార్మప్ మ్యాచ్ లను ఉపయోగించుకుని ఫామ్ లోకి వస్తాడేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ కూడా ఫెయిలైతే మాత్రం ప్రధాన మ్యాచ్ లలో సంజూకు ప్లేస్ కష్టమే. అతని స్థానంలో ఇషాన్ కిషన్ కి చోటు దక్కుతుంది.దాదాపు ఏడాది తర్వాత జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ ఇటీవల కివీస్ పై దుమ్ము రేపాడు. ఇప్పుడు తిలక్ వర్మ గాయం నుంచి కోలుకోవడంతో రీ ఎంట్రీ ఖాయం అయింది. దీంతో సంజూ , ఇషాన్ కిషన్ లలో ఒకరిని పక్కన పెట్టాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో సంజూ తన ఫామ్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

అటు సూర్య కుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్యా , శివమ్ దూబే కూడా ఫామ్ లోకి వచ్చారు. అయితే బౌలింగ్ పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ భారీగా పరుగులు ఇచేస్తున్నారు. అసలు టోర్నీకి ముందు దీనిని అధిగమిస్తే భారత్ కు తిరుగుండదు.

మరోవైపు సౌతాఫ్రికా కూడా ఈ మ్యాచ్ ను సీరియస్ గా తీసుకుంది. తమ కాంభినేషన్ పై చివరి ప్రయోగాలకు సిద్ధమయింది. మొత్తం మీద ఇరు జట్లు ఈ వార్మప్ మ్యాచ్ ను సీరియస్ గా తీసుకోవడంతో హోరాహోరిగా సాగుతుందనీ అంచనా వేస్తున్నారు..

Mana Shankara Vara Prasad Garu:బాస్ వస్తున్నాడు..ఓటీటీలోకి మన శంకర వరప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button