blue eyes : నీలి కళ్ల అందం వెనుక దాగున్న అద్భుత సైన్స్..
blue eyes : నీలి కళ్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి? అవి ఎక్కడి నుంచి వచ్చాయి?

blue eyes : కళ్లు… అవి కేవలం చూడటానికి మాత్రమే కాదు, మనసులోని భావాలను ప్రతిబింబిస్తాయి. ఎవరినైనా వర్ణించాలన్నా, వారిలో ఏదో తెలియని ఆకర్షణను చెప్పాలన్నా మొదట మన చూపు నిలిచేది కళ్లపైనే. సాధారణంగా మన చుట్టూ ఉన్నవారిలో ఎక్కువ మందికి నల్లని లేదా గోధుమ రంగు కళ్లు ఉంటాయి. కానీ, కొందరికి మాత్రం సముద్రాన్ని పోలిన, ఆకాశాన్ని తలపించే నీలి కళ్లు ఉంటాయి. ఒకప్పుడు అపశకునంగా భావించే ఈ నీలి కళ్లు(Blue Eyes) లేదా ‘పిల్లి కళ్లు’.. ఇప్పుడు అందానికి, ఆకర్షణకు సింబల్స్‌గా మారిపోయాయి. మరి ఈ అద్భుతమైన నీలి కళ్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అనే ప్రశ్నలకు ఒక తాజా పరిశోధన కొన్ని ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టింది.
blue eyes
నీలికళ్లతో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒకే వ్యక్తి వారసుడే’ అని కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇది నిజమా, లేక కేవలం అపోహ మాత్రమేనా అనే విషయంపై పరిశోధకులు లోతుగా అధ్యయనం చేశారు. ప్రపంచ జనాభాలో దాదాపు 70 నుంచి 80 శాతం మందికి గోధుమ రంగు కళ్లు ఉండగా, కేవలం 8 నుంచి 10 శాతం మందికి మాత్రమే నీలి రంగు కళ్లు ఉన్నాయి. అలాగే, 2 శాతం మందికి ఆకుపచ్చ కళ్లు కనిపిస్తాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ చెప్పిన దాని ప్రకారం, సుమారు 10 వేల సంవత్సరాల క్రితం వరకు భూమిపై నివసించిన ప్రతి మనిషికి గోధుమ రంగు కళ్లే ఉండేవట.
ఈ పరిశోధనలో మరింత ఆసక్తికరమైన విషయం బయటపడింది. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు నీలి కళ్లు లేకపోయినా, నీలి కళ్లతోనే జన్మిస్తున్నారు. దీని వెనుక అసలు రహస్యం ఏమిటంటే.. ఒక వ్యక్తి జన్యువులలో (Genes) మార్పు వచ్చినప్పుడు, వారి పిల్లలు నీలి కళ్లతో పుడతారని నిపుణులు చెబుతున్నారు. ఈ జన్యు మార్పు(Genetics,) వల్ల గోధుమ రంగు కళ్లు.. నీలి రంగులోకి మారతాయట.
లాడ్బైబిల్ నివేదిక ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్ టాక్‌లో @daveallambymd అనే అకౌంట్లో ఒక నిపుణుడు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేశారు. నీలి కళ్లు ఉన్న వ్యక్తులందరూ ఒకరికొకరు సంబంధం కలిగి ఉన్నారని ఆయన వివరించారు. దీనికి కారణం, వీరంతా 6 వేల నుంచి 10 వేల సంవత్సరాల క్రితం నల్ల సముద్రం (Black Sea) సమీపంలో నివసించిన ఒకే ఒక వ్యక్తికి వారసులుగా చెప్పబడుతున్నారు.
అలాగే డాక్టర్ అల్లంబి అనే ఈ పరిశోధకుడు చెప్పిన దాని ప్రకారం, ప్రపంచంలో ఎవరికైనా తనలాంటి నీలి కళ్లు ఉంటే, వాళ్లందరూ అదే ఒకే ఒక పూర్వీకుడి వారసులే అయినట్లు. కాబట్టి, ప్రపంచమంతటా నీలి కళ్లున్న వారందరికీ దాదాపు 700 మిలియన్లు (70 కోట్లకు పైగా) మంది బంధువులు ఉన్నట్లే అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక చిన్న జన్యు మార్పు ఇంత సుదీర్ఘ కాలం పాటు ఎలా కొనసాగింది అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. నీలికళ్ల అందం కేవలం కంటికి ఆకర్షణీయంగా కనిపించడమే కాదు, మానవ జన్యు చరిత్రలో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని తెలియజేస్తుంది.