Method:జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఈ మెథడ్.. ఫాలో అవుతారా మరి?
Method:ఏకాగ్రత పెరగడానికి, ఒత్తిడి తగ్గడానికి కూడా జువలైజేషన్ టెక్నిక్ ఎంతో సహాయపడుతుందట.
Method
మనలో చాలామందికి ఇంపార్టెంట్ అయిన విషయాలను గుర్తుంచుకోవడం కూడా ఒక పెద్ద సవాలుగా అనిపిస్తుంది. అయితే ప్రాచీన గ్రీకులు , రోమన్లు వాడిన ‘మెథడ్ ఆఫ్ లోకై’ లేక ‘మెమరీ ప్యాలెస్’ (Memory Palace) అనే టెక్నిక్ ద్వారా మీ జ్ఞాపకశక్తిని అసాధారణంగా పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఎలా అంటే ఈ మెథడ్ (Method) ప్రకారం, మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలను.. మనకు బాగా తెలిసిన ఒక ప్రదేశంతో అంటే ఉదాహరణకు మీ ఇల్లు ఊహించుకోవాలి. మీ ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి బెడ్ రూమ్ వరకు ఉన్న వస్తువులను ఒక వరుస క్రమంలో గుర్తుంచుకుని, ఒక్కో వస్తువు దగ్గర ఒక్కో విషయాన్ని ‘లింక్’ చేస్తూ ఉండాలి.
ఇంకా వివరంగా చెప్పాలంటే ..ఉదాహరణకు మీరు ఒక లిస్ట్ గుర్తుంచుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి దీనికోసం.. మీ ఇంటి గుమ్మం దగ్గర ఒక విషయం, సోఫా మీద ఇంకో విషయం ఉన్నట్లుగా విజువలైజ్ చేసుకోండి. మన మెదడుకు విడివిడి అంకెల కంటే, ఇలా చిత్రాలను, ప్రదేశాలను గుర్తుంచుకోవడం చాలా ఈజీ.

అందుకే ఈ మెథడ్(Method)ని వాడినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మన లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ప్రపంచ మెమరీ ఛాంపియన్ షిప్స్ లో పాల్గొనే వారు కూడా ఇదే టెక్నిక్ వాడుతుంటారని నిపుణులు చెబుతారు. ఇది కేవలం విద్యార్థులకే కాదు, ఆఫీసులో ప్రెజెంటేషన్ ఇచ్చే వారికి, ఏదైనా వేదికపై మాట్లాడేవారికి, పేర్లు గుర్తుంచుకోవడానికి ఇబ్బంది పడే వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఇది మొదట కొంచెం కష్టంగా అనిపించినా, ప్రాక్టీస్ చేస్తే మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లా మారుతుంది. ఏకాగ్రత పెరగడానికి, ఒత్తిడి తగ్గడానికి కూడా ఈ విజువలైజేషన్ టెక్నిక్ ఎంతో సహాయపడుతుందట. ఒకసారి మీ ఇంటిని మీ మెమరీ ప్యాలెస్‌గా మార్చుకుని ఈ టెక్నిక్ ట్రై చేసి చూడండి, మీరు ఏ విషయాన్ని కూడా మర్చిపొమ్మన్నా మర్చిపోరు.
RBI:సైబర్ బాధితులకు డబ్బులు వాపస్..బాధితులకు ఆర్బీఐ ఈ డబ్బెక్కడి నుంచి ఇస్తుంది?



