Gold Rates:బంగారం ధరలకు బ్రేక్.. దేశవ్యాప్తంగా పడిపోయిన గోల్డ్ రేట్స్
Gold Rates: ఒకవేళ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత విషమిస్తే మాత్రం..బంగారం ధర రెండు లక్షల రూపాయల మార్కును కూడా దాటిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
Gold Rates
రెండు రోజులుగా ఇరాన్ -అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బకు భయపెట్టిన పసిడి ధరలు(Gold Rates).. ఈ రోజు అంటే సోమవారం ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. ఇది ఎప్పుడెప్పుడు ధరలు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్న సామాన్యులకు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకుంటున్నవారికి నిజంగా ఊరటనిచ్చింది.
నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గడంతో మార్కెట్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 3,290 రూపాయలు తగ్గి, లక్షా 69వేల 8వందల రూపాయల (1,69,800) వద్ద కొనసాగుతోంది. నిన్న లక్షా 73 వేల 70 రూపాయలు పలికింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ ధర కూడా 3 వేల రూపాయలు తగ్గి, లక్షా 55 వేల 6 వందల యాభై రూపాయలకు (1,55,650) చేరుకుంది. విజయవాడ , విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి.
ఇక చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర 1,70,840 రూపాయలుగా కొనసాగుతుండగా, నిన్నటితో పోలిస్తే అక్కడ 1,250 రూపాయలు తగ్గింది. బెంగళూరులో కూడా హైదరాబాద్ ధరలే ఉండగా, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,69,950 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు ఇంకా కమ్ముకున్నా సరే.. మార్కెట్లో చోటుచేసుకున్న కొన్ని మార్పుల వల్ల ధరలు ఈ స్థాయిలో తగ్గాయి. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం ఈ ఆనందం ఎంతో కాలం ఉండకపోవచ్చని ..ఒకవేళ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత విషమిస్తే మాత్రం..బంగారం ధర ఏకంగా రెండు లక్షల రూపాయల మార్కును కూడా దాటిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
మరోవైపు యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతుండటంతో.. పెట్టుబడిదారులంతా సురక్షితమైన మార్గంగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల డిమాండ్ పెరిగి పసిడి ధరలు(Gold Rates) మళ్లీ పెరిగే అవకాశం ఉంది.



