Just EntertainmentLatest News

The Paradise : ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్..ఇక్కడ టాక్ ఎలా ఉంది?

The Paradise : నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ కలెక్షన్లు, కాస్ట్ అండ్ క్రూ, ఓటీటీ విశేషాల పూర్తి సమాచారం చూద్దాం...

The Paradise

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో అంచనాల మధ్య రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని మూవీ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడానికి రెడీ అయింది. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise)పై .. ఫస్ట్ నుంచి భారీ హైప్‌తో వచ్చిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ అన్నీ ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.

సెప్టెంబర్ 24న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ(The Paradise) కొన్ని ప్రాంతాల్లో అంచనాలను పూర్తిగా రీచ్ అవకపోయినా నాని యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పీక్స్‌లో ఉందన్న టాక్ వచ్చింది. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ రోల్ ‘షికంజా మాలిక్’గా భయపెట్టగా, హీరోయిన్ కయాదు లోహర్ గ్లామర్ అండ్ యాక్టింగ్ మూవీకి మరో ప్లస్ అయింది. డివైడెడ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఓవరాల్‌గా రూ. 180 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

ఇప్పుడు ఈ విజువల్ యాక్షన్ డ్రామా మూవీ డిజిటల్ హక్కులను.. నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ రేటుకు సొంతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి నుంచే ‘ది ప్యారడైజ్’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అఫీషియల్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సహా పాన్ ఇండియా లాంగ్వేజ్‌లన్నింటిలోనూ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. కాగా థియేటర్ వెర్షన్‌లో కట్ చేసిన కొన్ని డిలీటెడ్ సీన్స్‌తో పాటు ఒక కొత్త సాంగ్‌ను ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేశారనే టాక్ నడుస్తోంది.

Pink Basket Dating : డేటింగ్ యాప్స్ ఓల్డ్ అయిపోయాయ్.. పింక్ బాస్కెట్ లవ్ స్టోరీస్ ట్రెండ్ అవుతున్నాయి..

Related Articles

Back to top button