Rye Rye Song:రికార్డుల వేటలో పెద్ది.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద చెర్రీ -రై రై రచ్చ
ye Rye Song: ముఖ్యంగా రై రై రారా సాంగ్‌లో రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
Rye Rye Song
గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. చెర్రీ, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా.. పెద్ది నుంచి రిలీజైన సెకండ్ సింగిల్ ..రై రై రారా(Rye Rye Song) ఇప్పుడు యూట్యూబ్‌ను ఊపేస్తోంది. కేవలం పాటగానే కాకుండా, ఒక సునామీలా దూసుకొచ్చిన ఈ సాంగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులను తిరగరాసింది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ అందించిన అద్భుతమైన స్వరాలకు, అనంత శ్రీరామ్ పవర్ ఫుల్ సాహిత్యం తోడవడంతో ఈ పాట కేవలం 24 గంటల్లోనే 46.1 మిలియన్ వ్యూస్ సాధించి ..టాలీవుడ్ చరిత్రలోనే ఎక్కువ వ్యూస్ పొందిన లిరికల్ సాంగ్‌గా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది
ముఖ్యంగా ఈ సాంగ్‌లో రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ వీడియో చివరలో చెర్రీ కొట్టిన ఆ షాట్ చూస్తుంటే.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయమనిపిస్తోందని మెగా ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.
ఇక ఈ పాటపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపిస్తూ, చరణ్ డాన్స్ చూస్తుంటే..తనకు పుత్రోత్సాహంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ అభినందనతో డైరెక్టర్ బుచ్చిబాబు , పెద్ది టీమ్ మొత్తంలో మరింత జోష్ పెరిగింది.

ప్రస్తుతం రామ్ చరణ్ పేరుతో దద్దరిల్లుతున్న యూట్యూబ్ రికార్డులను గమనిస్తే చెర్రీ దగ్గరలో కూడా ఎవరూ లేరని అర్థమవుతోంది. టాప్ 5 స్థానాల్లో మొదటి రెండు స్థానాలు కూడా పెద్ది సినిమాలోని రై రై రారా (Rye Rye Song), చికిరి పాటలవి కావడం మెగా ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లోని దేఖ్లేంగే సాలా, పుష్ప 2 లోని కిస్సిక్, గేమ్ ఛేంజర్‌లోని నా నా హైరానా సాంగ్స్ ఉన్నాయి.
ఇలా మొదటి ఐదు స్థానాలు మెగా హీరోలవే కావడంతో మెగా అండ్ అల్లు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నాని ది ప్యారడైజ్ నుంచి వచ్చిన ఆయా షేర్ సాంగ్ మాత్రం ఆరో స్థానంలో కొనసాగుతుంది.
కాగా విలేజ్ బ్యాక్‌డ్రాప్, మాస్ ఎనర్జీతో వస్తున్న పెద్ది మూవీ ప్రమోషన్స్ ఇప్పుడే ఈ రేంజ్లో ఉంటే.. ఇక సినిమా రిలీజయ్యాక బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు కనుమరుగవుతాయో చూడాలి మరి.



