HealthJust LifestyleLatest News

Mind:ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవాలా? అయితే ఈ ట్రిక్స్ వాడి చూడండి..

Mind:కేవలం మనల్ని ఇష్టపడే వారిలోనే కాకుండా.. మనపై గౌరవం ఉన్న వారిలో కూడా ఈ అనుకరణ కనిపిస్తుంది.

Mind

మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడమనేది నిజంగా పెద్ద ఆర్ట్ . దీనిలో ముఖ్యంగా ఎదుటివారు మనల్ని ఇష్టపడుతున్నారా, వారు మన గురించి ఎలాంటి భావనలో ఉన్నారనేది తెలుసుకోవడం కొంచెం కష్టమే కానీ జాగ్రత్తగా గమనిస్తే తెలుసుకోవచ్చు.  ఎందుకంటే ఎదుటి వారు చెప్పే మాటల కంటే వారి బాడీ లాంగ్వేజ్ ద్వారానే.. మన గురించి వాళ్లు ఏం ఆలోచిస్తున్నారనేది ఎక్కువగా తెలుస్తుందట.

సైకాలజీ చెబుతున్నదాని ప్రకారం, మనతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి కళ్లలోని కనుపాపలు అంటే ప్యూపిల్స్ కొంచెం వెడల్పుగా మారాయంటే దాని అర్ధం.. వారు మన మాటల పట్ల కానీ మన వ్యక్తిత్వం పట్ల కానీ అమితమైన ఆసక్తితో ఉన్నట్లేనట. ఇది తెలియకుండానే మన మెదడు(Mind) పంపించే ఒక సంకేతం అని అర్ధం చేసుకోవాలి.

అలాగే మిర్రరింగ్ అనే ఒక ఇంపార్టెంట్  సైకలాజికల్ ట్రిక్ కూడా ఉంది. అంటే మనం కూర్చున్న పద్ధతిని కానీ మనం తరచుగా వాడే పదాలను కానీ ఎదుటివారు కూడా తెలీకుండానే అనుకరిస్తున్నారంటే, వాళ్లు మనతో మానసికంగా చాలా లోతుగా కనెక్ట్ అయ్యారని అర్థం చేసుకోవాలట.  అయితే ఇది కేవలం మనల్ని ఇష్టపడే వారిలోనే కాకుండా.. మనపై గౌరవం ఉన్న వారిలో కూడా ఈ అనుకరణ కనిపిస్తుంది.

అంతేకాదు మనం అవతలివారికి ఏదైనా విషయం చెబుతున్నప్పుడు వారు.. మన వైపు కొంచెం ముందుకు వంగి వింటున్నారా లేదా అని గమనించండి. అలా వంగి వినడం అనేది వారి ఆసక్తితో పాటు మనపై ఉన్న నమ్మకాన్ని కూడా అది సూచిస్తుంది. ఒకవేళ వారు చేతులు కట్టుకుని కానీ, వెనక్కి వాలి కానీ కూర్చొంటే మాత్రం.. ఎదుటివారు మన మాటల పట్ల అంతగా ఆసక్తి చూపించడం లేదని లేదా మనతో ఏదో విషయంలో విభేదిస్తున్నారని అర్థం.

Mind
Mind

అలాగే మన మాటల పట్ల వారు చూపే రియాక్షన్ కూడా జాగ్రత్తగా గమనించాలి. మనం ఒక చిన్న జోక్ వేసినప్పుడు అందరికంటే ముందుగా వారు నవ్వుతున్నారంటే.. వారి కళ్లు మన కోసం వెతుకుతున్నాయని అర్థం చేసుకోవాలి.

ఇలాంటి చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్‌ను, మాటలను జాగ్రత్తగా గమనిస్తే.. మన చుట్టూ ఉన్న వారు మన గురించి ఏమనుకుంటున్నారో ఈజీగా అంచనా(Mind) వేసేయొచ్చు. పర్సనల్ లైఫ్‌లోనే కాకుండా ఆఫీసులో  కొలీగ్స్,  స్నేహితుల మధ్య కూడా  మన స్థానాన్ని అర్థం చేసుకోవడానికి  ఈ సైకాలజీ ట్రిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button