Just Andhra PradeshJust PoliticalLatest News

Chandrababu: మహిళా లోకానికి చంద్రన్న కానుక..

Chandrababu: మధ్యతరగతి,పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి అనేది పెద్ద ఆర్థిక భారంతో కూడుకున్న పనే అని అందరికీ తెలిసిందే.

Chandrababu

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమయాన ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని.. మహిళలకు అదిరిపోయే తీపి కబురు అందించింది. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. సీఎం చంద్రబాబు(Chandrababu) మూడు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారు.

ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి , యానిమేటర్లకు ఫ్రీగా స్మార్ట్‌ఫోన్ల పంపిణీ ద్వారా.. డ్వాక్రా మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం పావలా వడ్డీకే భారీ రుణ అవకాశాన్ని కల్పించడం ద్వారా ఆర్థికంగా మహిళలను ఆదుకోవడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశంగా భావిస్తోంది.

ఏపీలోని ఆడపిల్లలు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోవడానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో.. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి.. పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల్లో కనీసం 6 నెలలుగా సభ్యత్వం ఉన్న కుటుంబాలకు చెందిన ఇద్దరు బాలికలకు.. ఉన్నత విద్య కోసం పది వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాన్ని అందిస్తారు.

దీనికి కేవలం పావలా వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. తీసుకున్న లోన్‌ను 48 నెలల వాయిదాల్లో తీర్చే వెసులుబాటును కల్పించారు. ఈ రుణం కోసం ఆధార్ కార్డ్, కాలేజీ అడ్మిషన్ లెటర్ , ఫీజు రసీదు వంటి పత్రాలతో స్థానిక వెలుగు ఆఫీసులో కానీ యానిమేటర్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే స్త్రీనిధి బ్యాంకు అకౌంట్‌లోకి డబ్బులు డైరక్టుగా జమ అవుతాయి.

మధ్యతరగతి,పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి అనేది పెద్ద ఆర్థిక భారంతో కూడుకున్న పనే అని అందరికీ తెలిసిందే. ఆ భారాన్ని తగ్గించడానికి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి స్కీమ్ ద్వారా.. ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది.

Chandrababu
Chandrababu

డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళల కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు అవసరాన్ని బట్టి 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు తక్కువ వడ్డీకే అంటే.. కేవలం 25 పైసలతో రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఇది ఆడపిల్లల తల్లిదండ్రులకు కొండంత అండగా ఉంటోంది.

డ్వాక్రా సంఘాల నిర్వహణను మరింత ఆధునీకరించడానికి..కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 27,500 మంది యానిమేటర్లకు 15 వేల రూపాయల విలువైన స్మార్ట్‌ఫోన్లను ఫ్రీగా పంపిణీ చేయనున్నారు.

దీనివల్ల రికార్డుల నిర్వహణ, బుక్ కీపింగ్ పనులు మరింత ఈజీ అయిపోతాయి. వీటితో పాటు 5,000 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు ఫోన్లు, అలాగే 600 మంది ఏపీఎం (APM)లకు అత్యాధునిక ల్యాప్‌టాప్‌లను అందజేయనున్నారు. టెక్నాలజీని మహిళల ముంగిటకు చేర్చడం ద్వారా.. వారి పనిని ఈజీ చేయడమే కాకుండా, పారదర్శకతను పెంచడమే ఈ స్కీమ్ లక్ష్యంగా కూటమి(Chandrababu) ప్రభుత్వం కదులుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button