Iran – America War : ఇరాన్‌తో అమెరికా యుద్ధం.. ఇప్పటివరకూ అమెరికాకు ఎంత నష్టం ?
Iran - America War : ఇరాన్ గట్టి పోటీ ఇవ్వడం అమెరికా ఏమాత్రం ఊహించలేకపోయింది. అందుకే భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
Iran – America War
అమెరికా, ఇరాన్ యుద్ధం కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. మధ్యలో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసినా తర్వాత ఇరాన్ ఆ ఒప్పందం ఉల్లంఘించిందనీ ఆరోపిస్తూ అమెరికా మళ్లీ దాడులకు దిగింది. వారం రోజులుగా రెండు దేశాల మధ్య ఈ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
అయితే ఇప్పటివరకూ అమెరికా ఇరాన్ పై యుద్ధం(Iran – America War) కోసం ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా ఇప్పటివరకు సుమారు 37.5 బిలియన్ల డాలర్లు నుంచి 113 బిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 3.1 లక్షల కోట్లు నుంచి రూ. 9.4 లక్షల కోట్లు వరకు ప్రత్యక్షంగా ఖర్చు చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు అంచనా వేశాయి.
అంతేకాదు దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావాలు, ఇతర నష్టాలను కలుపుకొంటే ఈ మొత్తం 1 ట్రిలియన్ దాటొచ్చని నిపుణులు భావిస్తున్నారు. గడిచిన రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌పై అమెరికా మొత్తం 8 ట్రిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు చేసింది.
అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను రక్షించడం, ఇరాన్ అణు కార్యక్రమాలను అణచివేయడం, ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ అందిస్తున్న మద్దతును నిరోధించడం వంటి కారణాలతో అమెరికా ఈ యుద్ధం మొదలు పెట్టింది. కానీ ఇరాన్ గట్టి పోటీ ఇవ్వడం అమెరికా ఏమాత్రం ఊహించలేకపోయింది. అందుకే భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
యుద్ధం ప్రారంభమైన మొదటి 24 గంటల్లోనే అమెరికా ఏకంగా 779 మిలియన్ డాలర్లు సుమారు 6,900 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. దాడులు ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే 5.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా సైన్యం వినియోగించింది. యుద్ధ వ్యయం విపరీతంగా పెరగడంతో, తమ దేశ రక్షణ బడ్జెట్‌ను 40 శాతం పెంచాలని అమెరికా రక్షణ శాఖ ప్రతిపాదించింది.

ఇరాన్‌పై జరిపిన నిరంతర దాడుల వల్ల అమెరికా వద్ద ఉన్న అత్యంత అత్యాధునిక క్షిపణులు, బాంబుల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇరాన్ జరిపిన ఎదురుదాడుల్లో అమెరికాకు చెందిన కొన్ని ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానాలు, ఎయిరియల్ రీఫ్యూయలింగ్ విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రాంతీయ రక్షణ కవచంగా ఉన్న అమెరికా రాడార్లు, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ యుద్ధం వల్ల అమెరికా తన ఇతర వ్యూహాత్మక లక్ష్యాలపై దృష్టి పెట్టలేకపోయింది.





