T20 World Cup : ఆల్ ది బెస్ట్ టీమిండియా..నగరంలో వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్
T20 World Cup : మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మరే క్రీడకూ లేదు. క్రికెటర్లను అభిమానులు దాదాపు దేవుళ్లులా ఆరాధిస్తారు. ప్రత్యేకించి హైదరాబాద్ లోనూ విపరీతమైన క్రికెట్ క్రేజ్ ఉంది
T20 World Cup
మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మరే క్రీడకూ లేదు. క్రికెటర్లను అభిమానులు దాదాపు దేవుళ్లులా ఆరాధిస్తారు. ప్రత్యేకించి హైదరాబాద్ లోనూ విపరీతమైన క్రికెట్ క్రేజ్ ఉంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఈ క్రికెట్ హంగామా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్(T20 World Cup) ను మరోసారి గెలిచేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచిన నేపథ్యంలో నగర యువత అంతా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆదివారం జరగనున్న ఫైనల్ ను వీక్షించేందుకు యూత్ అంతా తమ తమ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. శనివారం ఎక్కడ చూసినా ఈ మ్యాచ్ గురించే చర్చ.. ఫైనల్లో న్యూజిలాండ్ ను భారత్ ఓడిస్తుందని, వరుసగా రెండో సారి ట్రోఫీ గెలవడం ఖాయమని నగర అభిమానులు పూర్తి ధీమాతో ఉన్నారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు వీరంతా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
హైదరాబాద్ లో క్రికెట్ కోచింగ్ నేర్చుకుంటున్న చిన్నారులు, కార్పొరేట్ ఎంప్లాయిస్ , కాలేజీ కుర్రాళ్లు , స్కూల్ పిల్లలు, అమ్మాయిలు.. ఇలా ప్రతీ ఒక్కరూ భారత్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని పబ్బులు, రెస్టారెంట్లు, ప్రముఖ హోటల్స్ ఈ మ్యాచ్ ను బిగ్ స్క్రీన్స్ పై అభిమానులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు పలు ఆఫర్లను కూడా ప్రకటించాయి. అన్ లిమిటెడ్ స్నాక్స్ , లిక్కర్, ఫుడ్ అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. అటు పలు మూవీ స్క్రీన్లపైనా మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసారు. మొత్తం మీద వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ తో హైదరాబాద్ కూడా ఊగిపోతోంది. భారత్ ఏదైనా పెద్ద టోర్నీ గెలిచినప్పుడు నగరంలో ఉండే సందడి అందరికీ తెలుసు.
రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత ట్యాంక్ బండ్ పై యువత చేసే హంగామా అంతా ఇంతా కాదు. గత ఏడాది ఆసియాకప్ లో పాక్ ను ఓడించి భారత్ టైటిల్ గెలిచినప్పుడు కూడా ఇలాంటి హడావిడే నెలకొంది. ఇప్పుడు ఇండియా టీ20 ప్రపంచకప్(T20 World Cup) ట్రోఫీ గెలిచిన తర్వాత ఇక నగరంలో హంగామా దీనికి వంద రెట్లు ఎక్కువగా ఉంటుందంటూ పలువురు చెబుతున్నారు.
All roads lead to Ahmedabad tomorrow as India lock horns with New Zealand in a gripping #T20WorldCup final clash 🤩
Don't miss LIVE action, broadcast details ▶️ https://t.co/NPykWM7qqY pic.twitter.com/op4sVJe3Qd
— ICC (@ICC) March 7, 2026





