Tamil Nadu Data Leak : తమిళనాడు పెట్టుబడుల వివాదం ఏంటి? ఏపీకి డేటా లీక్ అయిందా?
Tamil Nadu Data Leak : తమిళనాడులోని గైడెన్స్ కంపనీ ఎంప్లాయిలపై డేటా లీక్ ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,614 కోట్ల పెట్టుబడులు, విజయ్ ప్రభుత్వంపై డీఎంకే విమర్శలు.. అసలు వివాదం వెనుక ఉన్న వివరాలేంటి?
Tamil Nadu Data Leak
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇండస్ట్రియల్ పెట్టుబడుల కోసం పోటీ.. ఇప్పుడ కొత్త పొలిటికల్ వివాదానికి దారితీసింది. ఒకప్పుడు ఇన్వెస్టిమెంట్లను ఆకర్షించడంలో తమిళనాడు ముందుండగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే స్థాయిలో ఇంటర్నేషనల్ కంపెనీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.
ఈ పోటీలో భాగంగా 3 దక్షిణ కొరియా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కంపెనీలు ఏపీలో రూ.1,614 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ పెట్టుబడుల వెనుక తమిళనాడు గవర్నమెంట్‌కు చెందిన కీలక సమాచారం ఏపీకి చేరిందా? అక్కడి పెట్టుబడుల ప్రోత్సాహక కంపెనీలో వర్క్ చేసిన ఉద్యోగులే డేటాను బయటకు పంపించారా? అనే ఆరోపణలు ఇప్పుడు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య కొత్త వివాదాన్ని రాజేశాయి.
ఈ వ్యవహారం కేవలం ఇండస్ట్రియల్ పోటీ దగ్గరే ఆగలేదు. తమిళనాడులో పవర్లో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే గవర్నమెంట్‌నే ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్ష డీఎంకేకు మరో అంశం దొరికినట్లయింది. పెట్టుబడులు పక్క రాష్ట్రానికి వెళ్లిపోతుంటే విజయ్ సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నిస్తోంది. మరోవైపు ఉద్యోగుల తొలగింపు, రిజైన్‌పై వస్తున్న కథనాలు ఈ వివాదాన్ని మరింత పెంచుతున్నాయి.
నిజానికి ఈ వివాదానికి కేంద్రంగా నిలిచింది అనంతపురం జిల్లాలో ఏర్పాటు కానున్న 3 దక్షిణ కొరియా కంపెనీల తయారీ యూనిట్లు. హ్యుందాయ్, కియా వంటి గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీలకు విడిభాగాలు సరఫరా చేసే హ్వాసిన్ (Hwashin), సియోన్ (Seoyon), ఐవామెట్ (Iwamet) కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రూ.1,614 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.
వీటిలో హ్వాసిన్ రూ.850 కోట్లు, సియోన్ రూ.514 కోట్లు, ఐవామెట్ రూ.250 కోట్ల పెట్టుబడులకు కట్టుబడ్డాయి. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా సుమారు 1,418 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. గతంలో ఈ కంపెనీలు తమిళనాడులో తమ కార్యకలాపాలను విస్తరించడానికి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు కూడా న్యూస్ కూడా వచ్చింది. కానీ చివరకు ఇప్పుడు ఏపీని ఎంచుకోవడం తమిళనాడుకు పారిశ్రామికంగా ఎదురుదెబ్బగానే మారింది.
అయితే ఇక్కడే దీనికి రాజకీయ వివాదం అంటుకుంది. ఏపీకి పెట్టుబడులు రావడం వెనుక చంద్రబాబు గవర్నమెంట్ అనుసరిస్తున్న పెట్టుబడుల ఆకర్షణ విధానం ఏమైనా ఉందా? లేక తమిళనాడులో కంపెనీలతో జరిగిన చర్చలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందుగానే ఏపీకి చేరిపోయిందా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
తమిళనాడు గవర్నమెంట్ ఇండస్ట్రియల్ శాఖకు అనుబంధంగా పనిచేసే గైడెన్స్ తమిళనాడు కంపెనీ ఈ వివాదంలో కీలకంగా మారింది. 1992లో ఏర్పాటైన ఈ కంపెనీ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకురావడం, ఇండస్ట్రియల్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించడం, పర్మిషన్ ప్రాసెస్‌లో సహకరించడం, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరపడం వంటి బాధ్యతలను నిర్వహిస్తుంది.
ఒక కంపెనీ ఏ రాష్ట్రంలో ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలనుకుంటోంది? అక్కడ ఎంత పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది? కంపెనీ పెట్టడానికి ఎలాంటి సబ్సిడీలు కోరుతోంది? ఏ ప్రాంతంలో భూమి అవసరం వంటి వివరాలన్నీ కూడా పెట్టుబడుల చర్చల్లో కీలకంగా ఉంటాయి. అందువల్ల గైడెన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
దీనిలో భాగంగానే గైడెన్స్‌లో పనిచేసిన కొంతమంది ఉద్యోగులు ఏపీ గవర్నమెంట్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (APEDB)లో చేరడం అనుమానాలకు కారణంగా నిలిచింది. ముఖ్యంగా ముగ్గురు మాజీ ఉద్యోగులు ఏపీ పెట్టుబడుల వ్యవస్థలో చేరినట్లు తేలింది. విశాఖపట్నంలో నవంబర్ 12వ తేదీ, 13 తేదీల్లో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సందర్భంగా సీఎం చంద్రబాబు వారిని అభినందించినట్లు కూడా కథనాలు వచ్చాయి. దీంతో పాత ఎంప్లాయిస్ వద్ద ఉన్న ఇన్ఫో ఏపీకి చేరిందనే అనుమానాలు మరింత ప్రచారంలోకి వచ్చాయి.
ఈ ఇష్యూలో అత్యంత ఆసక్తికరమైన అంశం గైడెన్స్ సంస్థ నుంచి బయటకు వెళ్లిన 15 మంది ఉద్యోగుల వ్యవహారం మరింత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముందు వీరిని పెట్టుబడుల ఇన్ఫర్మేషన్ను ఏపీకి చేరవేశారనే అనుమానంతో తమిళనాడు ప్రభుత్వం తొలగించిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు ఈ కథనానికి మరో కోణాన్ని తీసుకొచ్చాయి.
జూన్ 29వ తేదీన గైడెన్స్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఎంప్లాయిస్‌కు రిలీవింగ్ లెటర్లు ఇచ్చి వెంటనే వెళ్లిపోవాలని చెప్పినట్లు ది న్యూస్ మినిట్ కథనం పేర్కొంది. ఆ తర్వాత జూలైలో మరో 13 మంది ఉద్యోగులు వేర్వేరు కారణాలతో రిజైన్ చేసి నోటీసు పీరియడ్ పూర్తి చేసినట్లు మాజీ ఎంప్లాయిస్ వెల్లడించారు. అంటే 15 మందినీ ఒకేసారి డేటా లీక్ అభియోగాలతో తొలగించారనే ప్రచారానికి పూర్తి ఆధారాలు లేవని తెలుస్తోంది.
మరోవైపు, ఈ ఉద్యోగులలో కొంతమంది తమకు కంపెనీలో పని వాతావరణం అనుకూలంగా లేదని, శాలరీ వ్యత్యాసాలు, యాజమాన్యంతో విభేదాలు వంటి సమస్యలు ఉన్నాయని చెప్పినట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఏపీ గవర్నమెంట్ తరఫున వచ్చిన వాదన ప్రకారం, మాజీ ఉద్యోగుల్లో కొందరికి APEDB ఉద్యోగ అవకాశాలను కల్పించింది. పెట్టుబడుల రంగంలో ఎక్స్పీరియన్స్ ఉన్నవారిని ఇతర రాష్ట్రాలు నియమించుకోవడం సాధారణమేనని ఏపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ టోటల్ వ్యవహారంపై తమిళనాడులో పొలిటికల్‌గా పెద్ద దుమారమే రేగుతోంది. విజయ్ సర్కార్‌పై డీఎంకే నేత టీఆర్బీ రాజా, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే, ఏఎంఎంకే లీడర్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నార. అనుభవజ్ఞులైన ఉద్యోగులను తప్పుబట్టడం సరికాదని, ఒకవేళ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయి ఉంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వ వర్గాలు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. ఇతర రాష్ట్రాల సీక్రెట్ ఇన్ఫోతో పెట్టుబడులు ఆకర్షించాల్సిన అవసరం ఏపీకి లేదని కౌంటర్ ఇచ్చాయి. పారిశ్రామిక అనుకూల విధానాలు, వేగవంతమైన పర్మిషన్లు, మౌలిక సదుపాయాలే పెట్టుబడిదారులను ఆకట్టుకుంటాయని వివరించాయి. మెయిన్‌గా మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటనలో హ్యుందాయ్, కియా సరఫరా కంపెనీలతో జరిపిన చర్చలు, ఏపీఈడీబీ (APEDB) చేసిన గ్లోబల్ స్థాయి ప్రయత్నాల వల్లే ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నాయి.
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఫ్యూయల్ వంటి రంగాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆధిపత్య పోటీ నడుస్తోంది. ఉద్యోగులు ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్‌కు మారడం కామనే అయినా, డేటా లీక్ ఆరోపణలు రావడం మాత్రం ఈ రెండు రాష్ట్రాల్లోనూ వేడి పుట్టిస్తోంది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వివాదం కేవలం పొలిటికల్ విమర్శలకే పరిమితమవుతుందా లేక విచారణ వరకు వెళ్తుందా అనేది చూడాలి.
Spectacle Marks : కళ్లజోడు వల్ల ముక్కుపై మచ్చలు వచ్చాయా?.. ఈ సింపుల్ రెమెడీస్ ఫాలో అవ్వండి..





