Just LifestyleLatest News

Career:రెండు పడవల ప్రయాణం కాదు..రెండు కళ్లూ ఇంపార్టెంటే..కెరీర్,ఇంటి బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయాలి?

Career: అదనంగా పడిన ఉద్యోగ పనులతో పాటు కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.

Career

ఒకప్పుడు మగవాళ్లు ఆఫీసుకు, బిజినెస్ పనుల మీద బయటకు వెళ్తే.. మహిళలు ఇంటిని, పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉండేవారు. కానీ కాలం మారింది. మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబ భారాన్ని మోస్తూనే ఆర్థికంగా మగవారికి చేయూతనిస్తున్నారు. అదనంగా పడిన ఉద్యోగ పనులతో పాటు కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.

ఒకవైపు ఆకాశమే హద్దుగా కెరీర్‌(Career) లో దూసుకుపోవాల్సిన పరిస్థితి.. మరోవైపు కంటిపాపలా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్. దీనిని రెండు పడవల ప్రయాణమని చాలామంది అనుకుంటున్నారు. కానీ సరైన అవగాహన, పక్కా ప్రణాళిక ఉంటే మాత్రం ఈ రెండు బాధ్యతలను రెండు కళ్లలా చక్కగా నిర్వహించొచ్చని కొంతమంది మహిళలు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఇదొక ఒత్తిడితో కూడిన పోరాటం కాకూడదని.. ఒక అందమైన జీవన కళగా మారాలని చెబుతూనే ఉన్నారు.

టైమ్ మేనేజ్మెంట్ (Time Management) అనేది ఈ బ్యాలెన్సింగ్‌కు వెన్నెముక వంటిది. రేపు ఏం చేయాలనే పనుల లిస్టును ఈరోజే రెడీ చేసుకోవడం వల్ల గందరగోళం ఉండదు. మన పనులలో ఏది ముఖ్యం, ఏది అత్యవసరం అనే విషయంలో క్లారిటీ ఉండాలి. ఆఫీసు పనిని ఆఫీసు వరకే పరిమితం చేసి, ఆఫీస్ హవర్స్ దాటాక కేవలం కుటుంబానికే కేటాయించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

అలాగే ఇంటి పనులన్నిటినీ కూడా కేవలం ఒకరే భుజానికెత్తుకోవాలనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి పనులను పంచుకోవాలని ఇంట్లో వారికి వివరించాలి. దీని వల్ల పని భారం తగ్గడమే కాకుండా, ఒకరిపై ఒకరికి అనురాగం కూడా పెరుగుతుంది. బాధ్యతలను పంచుకోవడం అనేది ఒకరికొకరు ఇచ్చే గౌరవానికి గుర్తు అని తెలుసుకోవాలి.

Career
Career

అంతేకాదు కెరీర్ రేసులో పరిగెడుతూ మనల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఉల్లాసం కూడా అంతే అవసరం. మంచి నిద్ర, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల పనులను వేగంగా పూర్తి చేసే శక్తి వస్తుంది. కొన్నిసార్లు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగకపోవచ్చు. అటువంటప్పుడు మనల్ని మనం నిందించుకోకుండా పర్వాలేదని సరిపెట్టుకోవాలి. పర్ఫెక్ట్‌గా ఉండటం కంటే ప్రశాంతంగా ఉండటం ముఖ్యం.

వారంలో కనీసం కొంత సమయం మనకు ఇష్టమైన పనికోసం అయినా లేదా ఏకాంతంగా ఉండటానికి అయినా కేటాయించాలి. అప్పుడే మళ్లీ కొత్త ఉత్సాహంతో పనులపై దృష్టి పెట్టేలా చేస్తుంది. కెరీర్ , కుటుంబం మధ్య బ్యాలెన్స్ కుదిరినప్పుడే లైఫ్ పరిపూర్ణంగా మారుతుంది. ఇది కేవలం బాధ్యత మాత్రమే కాదని.. మనం ప్రేమించే వ్యక్తుల కోసం, మన లక్ష్యాల కోసం మనతో మనం చేసే ఒక అద్భుతమైన ప్రయాణమని తెలుసుకోవాలి.అపుడే రెండిటిని బ్యాలెన్స్ చేసుకోగలరు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button