Summer:మార్చిలోనే సెగలు పుట్టిస్తున్న వేసవి.. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు రానున్నాయి?
Summer: గతంలో ఎన్నడూ లేని విధంగా టెంపరేచర్ అప్పుడే 40 నుంచి 42 డిగ్రీలకు చేరుకున్నాయి.
Summer
ఈ ఏడాది కాస్త ముందుగానే ఎండల ప్రభావం పడింది. ఇంకా చెప్పాలంటే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి కూడా ఎండలు(Summer) మండిపోతున్నాయి.మార్చి మొదటి వారంలో అయితే ఇవి మరింత ముదిరిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టెంపరేచర్ అప్పుడే 40 నుంచి 42 డిగ్రీలకు చేరుకున్నాయి. దీనికి తోడు మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్, యుద్ధం భారత దేశంపై ప్రభావం చూపుతోంది. యుద్ధం వల్ల గ్యాస్, చమురు రాక తగ్గిపోవడంతో పవర్ ప్లాంట్లు సరిగ్గా నడవట్లేదు.
దీంతో ఏసీలు, ఫ్యాన్లు ఎక్కువగా వాడే వేసవిలో కరెంటు కోతలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం, రాబోయే రోజుల్లో ఎండలు 45 నుంచి 50 డిగ్రీల వరకు వెళ్లొచ్చని తెలుస్తోంది. అంటే ఈ ఏడాది వేసవి గతంలో కంటే చాలా కష్టంగా ఉండబోతోందన్న మాట.
ఎండలు(Summer) ఇంతలా పెరగడానికి కారణం గ్లోబల్ వార్మింగ్ ఒకటైతే, రాజస్థాన్ నుంచి వస్తున్న వేడి గాలులు మరో కారణం. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ లాంటి చోట్ల ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడి వల్ల తలనొప్పి, డీహైడ్రేషన్ లాంటివి వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. ఎండలో తిరగడం మానేయాలి. వీలైనంత వరకు కాటన్ బట్టలు వేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఒంట్లో కాస్త నీరసంగా అనిపిస్తే ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు వంటివి తాగుతూ ఉండాలి.

ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజురోజుకు తీవ్రతరమవుతుంది. హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల గ్యాస్ కొరత వల్ల పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గిపోయింది. దీనివల్ల రాత్రి పూట కూడా పవర్ కట్స్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకే సోలార్ ప్యానెల్స్ ఉన్నవారు వాటిని రెడీగా ఉంచుకోవడం, వీలైతే ఇన్వర్టర్లు, బ్యాటరీ బ్యాకప్ వంటివి సిద్ధం చేసుకోవడం మంచిది.
మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు, పీజీలు నడిపేవాళ్లు కూడా.. కరెంటు కోతలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. వీలైనంత వరకు నీటిని, కరెంటును పొదుపుగా వాడాలని సూచిస్తున్నాయి. యుద్ధం పరిస్థితి అదుపులోకి రాకపోతే గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు నుంచే మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం.





