Just SportsLatest News

Ajinkya Rahane : ఇలాంటి టెస్ట్ బ్యాటర్ మళ్లీ రాడు.. రహానేకు ఫ్యాన్స్ హ్యాట్సాఫ్

Ajinkya Rahane : ద్రవిడ్, లక్ష్మణ్, పుజారా తర్వాత భారత టెస్ట్ జట్టులో అత్యంత నమ్మదగిన బ్యాటర్ ఎవరంటే మరో ఆలోచన లేకుండా రహానే పేరు చెబుతారు.

Ajinkya Rahane

క్రికెట్‌లో ఎప్పుడైనా రెడ్ బాల్ ఫార్మాట్‌లో రాణించిన ఆటగాడే తోపు… ఎవరేమనుకున్నా ఇది అంగీకరించాల్సిందే. వన్డేల్లో అయితే 50 ఓవర్లే… టీ20ల్లో అయితే 20 ఓవర్లే కానీ టెస్ట్ క్రికెట్‌లో రోజుకు 90 ఓవర్లు, ఐదు రోజుల పాటు గ్రౌండ్‌లోనే ఉండాలి. అది కూడా ఎంతో సహనంతో బ్యాటింగ్ చేయాలి. ప్రస్తుత తరంలో టెస్టుల్లో నిలకడగా రాణించే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే వెతుక్కోవాల్సిందే.

కానీ ద్రవిడ్, లక్ష్మణ్, పుజారా తర్వాత భారత టెస్ట్ జట్టులో అత్యంత నమ్మదగిన బ్యాటర్ ఎవరంటే మరో ఆలోచన లేకుండా రహానే(Ajinkya Rahane) పేరు చెబుతారు. ఎందుకంటే టెస్టుల్లో రహానే క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. జాతీయ జట్టులో ప్లేస్ ఉన్నా లేకున్నా దేశవాళీ క్రికెట్‌లో ఎప్పటికప్పుడు తనదైన ముద్ర వేస్తూనే ఉన్నాడు.

తాజాగా రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అతని అద్భుత బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. తన కెరీర్‌లో రహానే ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. క్రీజులో నిలదొక్కుకున్నాడంటే అతన్ని ఔట్ చేయడం చాలా కష్టం. ప్రత్యర్థి బౌలర్లకు ఈ విషయం బాగా తెలుసు.

ఒత్తిడిలో రాణించే అద్భుతమైన బ్యాటింగ్ శైలి రహానే సొంతం. అలాగే సైలెంట్ కెప్టెన్సీతో, వివాదాలకు దూరంగా , హుందాగా వ్యవహరించే సారథిగా రహానేకు గుర్తింపు ఉంది. రహానే కెరీర్‌లో 2020-21 ఆస్ట్రేలియా పర్యటన అద్భుతమనే చెప్పాలి. అడిలైడ్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలి భారత్ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నపుడు అప్పటి కెప్టెన్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సారథ్య బాధ్యతలు అందుకున్న రహానే యువ ఆటగాళ్లతో జట్టును అద్భుతంగా నడిపించాడు. మెల్‌బోర్న్ టెస్టులో కెప్టెన్‌గా బాధ్యతాయుతమైన 112 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

చారిత్రక గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాకు ఉన్న 32 ఏళ్ల అజేయ రికార్డును బద్దలు కొట్టి, సిరీస్‌ను 2-1తో గెలిపించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా నిలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓటమి ఎరుగని కెప్టెన్‌గా రహానేకు అరుదైన రికార్డు ఉంది. రహానే సారథ్యం వహించిన 6 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ 4 మ్యాచ్‌లు గెలవగా, 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డు ఇది.

Ajinkya Rahane
Ajinkya Rahane

అలాగే విదేశాల్లో పర్యటించినప్పుడు రహానే అత్యంత నమ్మకమైన బ్యాటర్‌గా నిలిచేవాడు. రహానే తన కెరీర్ మొత్తంలో వివాదాలకు దూరంగా, చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి. చాలా సందర్భాల్లో ఇది రుజువైంది. ఆసీస్‌పై సిరీస్ గెలిచిన తర్వాత హోటల్ సిబ్బంది కంగారూ రూపంలో కేక్ కట్ చేయమని కోరగా, నిరాకరించాడు.

ప్రత్యర్థి దేశపు జాతీయ చిహ్నన్ని అవమానించడం సరికాదన్న గొప్ప వ్యక్తిత్వం రహానేకు మాత్రమే సొంతమని ఆ దేశ మీడియా సైతం ప్రశంసలు కురిపించింది. ఏది ఏమైనా రహానే( Ajinkya Rahane) లాంటి గొప్ప బ్యాటర్ మళ్లీ భారత జట్టులో కనిపించడం కష్టమే.

ITR Filing : ఐటీఆర్ ఫైల్ చేసేశారా? ఈ 5 విషయాలు చెక్ చేయకపోతే ఇబ్బందులే

Related Articles

Back to top button