HealthLatest News

Watermelon:పుచ్చకాయలోని తెల్లటి భాగం పారేస్తున్నారా? అయితే ఇది మీకోసమే

Watermelon: పుచ్చకాయలో విటమిన్ A, B6, C వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా చర్మాన్ని కూడా కాంతివంతంగా ఉంచడంలోనూ సాయపడతాయి.

Watermelon

సమ్మర్ ఇలా ఎంటర్ అవగానే మనందరికీ గుర్తొచ్చే పండు.. పుచ్చకాయ(Watermelon). దీనిలో సుమారు 92 శాతం వరకు నీరు ఉండటం వల్ల ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఇది చాలా సహాయపడుతుంది.

సాధారణంగా మనం పుచ్చకాయ(Watermelon)ను ముక్కలుగా కోసుకుని, కేవలం ఎర్రటి భాగాన్ని మాత్రమే తిని మిగిలిన తెల్లటి భాగాన్ని పారేస్తుంటాం. కానీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, మనం పారేసే ఆ తెల్లటి భాగంలోనే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

పుచ్చకాయలోని తెల్లటి భాగం (Rind) తినడం వల్ల శరీరానికి అధిక మొత్తంలో ఫైబర్ అందుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది.

దీనిలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి , రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ తెల్లటి భాగాన్ని డైరెక్టుగా తినడానికి ఇష్టపడని వారు. దీనిని సలాడ్లలో లేదా జ్యూస్ చేసేటప్పుడు కలిపి తీసుకోవచ్చు.

Watermelon
Watermelon

అలాగే పుచ్చకాయ గింజలను మనలో చాలామంది పారేస్తుంటారు. కానీ ఈ గింజల్లో జింక్, మెగ్నీషియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బాడీలోని రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలను బలంగా ఉంచడంలో బాగా సహాయపడతాయి.

పుచ్చకాయలో విటమిన్ A, B6, C వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా చర్మాన్ని కూడా కాంతివంతంగా ఉంచడంలోనూ సాయపడతాయి. కాబట్టి ఇకపై పుచ్చకాయ తినేటప్పుడు ఎపుడైనా కేవలం ఎర్రటి భాగాన్నే కాకుండా, ఆ తెల్లటి భాగాన్ని కూడా ఆహారంలో భాగంగా చేసుకోండి. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం పుచ్చకాయను లిమిట్‌గానే తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button