Dhurandhar 2 : కలెక్షన్లలో సరికొత్త రికార్డులు…ధురంధర్ 2 ఐదు రోజుల వసూళ్లు ఇవే
Dhurandhar 2 : బాలీవుడ్ ట్రెండింగ్ మూవీ ధురంధర్ 2 రికార్డుల మోత మోగిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఇప్పటి వరకూ ఉన్న పలు బ్లాక్ బస్టర్ రికార్డులను బద్దలు కొడుతోంది
Dhurandhar 2
బాలీవుడ్ ట్రెండింగ్ మూవీ ధురంధర్ 2(Dhurandhar 2) రికార్డుల మోత మోగిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఇప్పటి వరకూ ఉన్న పలు బ్లాక్ బస్టర్ రికార్డులను బద్దలు కొడుతోంది. తొలి పార్ట్ ను మించిన కలెక్షన్లు రాబడుతోన్న ధురంధర్ ది రివెంజ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం ఐదే రోజుల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది.
రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీని ఆదిత్య ధర్ తెరకెక్కించారు. వరుస పండుగల సమయంలో విడుదలై ఆ సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకుంది. పెయిడ్ ప్రివ్యూలతోనే ధురంధర్ 2కు ఏకంగా రూ.43 కోట్లు వచ్చాయంటే ఆ క్రేజ్ అర్థమవుతోంది. బాలీవుడ్ లో గతంలో బడా హీరోలు నెలకొల్పిన కలెక్షన్ల రికార్డులన్నీ కనుమరుగైపోయాయి.
మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఆ ఒక్కరోజే 102 కోట్ల 55 లక్షలు కొల్లగొట్టింది. తొలిరోజే కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించింది.రూ.80 కోట్ల 72 లక్షలతో శుక్రవారం కాస్త జోరు తగ్గినట్టు కనిపించినా వీకెండ్ లో మాత్రం దుమ్మురేపింది. శని, ఆదివారాల్లో తొలిరోజుకు మించిన వసూళ్లు రాబట్టింది. శనివారం 113 కోట్లు, ఆదివారం 114.85 కోట్లు కలెక్షన్లు సాధించింది.
సాక్నిల్క్ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే ఐదోరోజు రూ.65 కోట్లు రాబట్టింది. భాషల వారీగా కేవలం హిందీ వెర్షన్ లో రూ.60 కోట్లు వసూలు చేస్తే.. కన్నడ, మళయాళంలో రూ.15 లక్షల చొప్పన వచ్చాయి. ఇక తమిళం నుంచి రూ.1.5 కోట్లు, తెలుగు నుంచి రూ.3.5 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా ఐదు రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా రూ.519.12 కోట్ల వసూళ్లు రాబట్టింది. సాధారణంగా హిట్ టాక్ వచ్చిన చిత్రాలు వారాంతంలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టినా మళ్లీ సోమవారం నుంచి తగ్గిపోతుంటాయి.

అయితే ధురంధర్ మాత్రం మండే సైతం మంచి కలెక్షన్లు రాబట్టింది. తద్వారా విడుదలైన తొలి సోమవారం అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. గతంలో సల్మాన్ ఖాన్ టైగర్ మూవీ తొలి సోమవారం రూ.59 కోట్ల 25 లక్షలు సాధిస్తే.. రణబీర్ కపూర్ యానిమల్ రూ.44.47 కోట్లు వసూలు చేసింది.
బాహుబలి హిందీ వెర్షన్ లో తొలి సోమవారం రూ.40.20 కోట్లు వసూలు చేస్తే.. ఇప్పుడు వీటన్నింటినీ ధురంధర్ 2(Dhurandhar 2) దాటేసింది. మండే ఏకంగా రూ.65 కోట్లు వసూలు చేసి అగ్రస్థానానికి దూసుకొచ్చింది. దీంతో ఇప్పటి వరకూ టాప్ 5లో నిలిచిన టైగర్ జిందా హై ఆరో స్థానానికి పడిపోయింది. మొత్తం మీద బ్లాక్ బస్టర్ చిత్రాల రికార్డులన్నింటినీ గల్లంతు చేసే లక్ష్యంతో ధురంధర్ దూసుకుపోతోంది.
Venky and Kalyan Ram :వెంకీ , కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ .. అనిల్ రావిపూడి కొత్త సినిమా విషయాలివే





