Just EntertainmentLatest News

Venky and Kalyan Ram :వెంకీ , కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ .. అనిల్ రావిపూడి కొత్త సినిమా విషయాలివే

Venky and Kalyan Ram : జూన్ లో మొదలుపెట్టి డిసెంబర్ కల్లా షూటింగ్ ఫినిష్ చేసి, 2027 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.

Venky and Kalyan Ram

టాలీవుడ్‌లో ఒక హిట్ డైరెక్టర్, ఒక స్టార్ హీరోతో మూవీ చేస్తున్నారంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటిది అదే డైరెక్టర్ తనకి లైఫ్ ఇచ్చిన హీరోతో, తనతో వరుస బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టిన మరో స్టార్ హీరోని కలిపి ఒకే ఫ్రేమ్‌లో చూపించడానికి రెడీ అయితే.. ఆ రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడమే కష్టం.

సరిగ్గా ఇప్పుడు ఇలాంటి ఒక సెన్సేషనల్ కాంబినేషన్‌తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు రీ క్రియేట్ చేయడానికి సర్వం సిద్ధమైంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్(Venky and Kalyan Ram) కలిసి యాక్ట్ చేయబోతోన్న మల్టీస్టారర్ మూవీ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ నుంచి సోషల్ మీడియా వరకు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

అనిల్ రావిపూడి కెరీర్‌ను ఒకసారి చూస్తే.. ఆయనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కళ్యాణ్ రామ్ కాగా, కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ అందించింది మాత్రం వెంకటేష్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వెంకీతో ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన అనిల్, ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్(Venky and Kalyan Ram)ను ఒకే స్క్రీన్ పైకి తీసుకువస్తున్నారన్న టాక్ నడుస్తోంది.

ఈ మూవీలో వెంకటేష్ మెయిన్‌ రోల్‌లో కనిపిస్తుండగా, కళ్యాణ్ రామ్ సెకండ్ లీడ్‌గా కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా మహానటి కీర్తి సురేష్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వెంకటేష్‌కు జోడీగా కీర్తి ..ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనుంది. కళ్యాణ్ రామ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే అఫీషియల్‌గా తెలియనుంది.

Venky and Kalyan Ram
Venky and Kalyan Ram

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఆదర్శ కుటుంబం AK47 అనే షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ పనులు కంప్లీట్ అవ్వగానే,, అంటే సరిగ్గా 2026 జూన్ చివరి వారం నుంచి అనిల్ రావిపూడి సినిమా సెట్‌లో అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్‌లోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. కేవలం మూడు కీలక షెడ్యూల్స్‌లోనే మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని అనిల్ రావిపూడి పక్కా ప్లాన్ తో ఉన్నారు.

జూన్ లో మొదలుపెట్టి డిసెంబర్ కల్లా షూటింగ్ ఫినిష్ చేసి, 2027 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి సీజన్ కు అనిల్ రావిపూడి ఒక స్పెషలిస్ట్ అన్న పేరు ఇప్పటికే ఉండటంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందని మూవీ యూనిట్ ధీమాగా ఉంది.

Lok Sabha and Assembly: 50 శాతం పెరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు..ఏపీ, తెలంగాణలో భారీగా పెరగనున్న ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు

Related Articles

Back to top button