Just SportsLatest News

IPL Captains : ఇంపాక్ట్ రూల్ ఉండాల్సిందే..కెప్టెన్ల మీటింగ్ లో తేల్చిచెప్పిన బీసీసీఐ

IPL Captains : ఐపీఎల్ 19వ సీజన్ కు శనివారం నుంచే తెరలేవబోతోంది. ఇప్పటికే అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. తాజాగా ఈ టోర్నీలో పాల్గొంటున్న 10 జట్ల కెప్టెన్లతో బీసీసీఐ సమావేశమైంది

హైలైట్

IPL Captains

ఐపీఎల్ 19వ సీజన్ కు శనివారం నుంచే తెరలేవబోతోంది. ఇప్పటికే అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. తాజాగా ఈ టోర్నీలో పాల్గొంటున్న 10 జట్ల కెప్టెన్లతో బీసీసీఐ సమావేశమైంది. ఈ సమావేశానికి తొలిసారి అందరూ భారత ఆటగాళ్లే కెప్టెన్లుగా(IPL Captains) రావడం హైలైట్ గా నిలిచింది.

రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్), రజత్ పటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్) రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్), అజింక్య రహానే (కోల్ కతా నైట్ రైడర్స్) , ఇషాన్ కిషన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) , రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్), అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్ ) సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీసీసీఐ మ్యాచ్ రిఫరీలు జవగళ్ శ్రీనాథ్, నితిన్ మీనన్‌, అంపైర్ ప్యానెల్‌ సభ్యులు టోర్నీలో ఉండే కీలక నిబంధనల గురించి కెప్టెన్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గత రెండు సీజన్లుగా చర్చనీయాంశంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై హాట్ డిస్కషన్ జరిగింది. కొందరు మాజీలు, లీగ్ లో ఆడుతున్న సీనియర్ ప్లేయర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ ను వ్యతిరేకించారు. ప్రస్తుత కెప్టెన్లలో అక్షర్ పటేల్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై సానుకూలంగా లేడు.

IPL Captains
IPL Captains

అయితే బీసీసీఐ మాత్రం మిగిలిన కెప్టెన్ల(IPL Captains) అభిప్రాయానికే ప్రాధాన్యతనిస్తూ 2027 వరకూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ఆల్ రౌండర్లకు ప్రాధాన్యత తగ్గుతుందన్న అభిప్రాయాన్ని బీసీసీఐ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే కంకుషన్ సబ్‌స్టిట్యూట్‌, ఒక ఓవర్లో రెండు బౌన్సర్లు, బ్యాట్ చెకింగ్, ఇన్నింగ్స్ టైమర్, మంచు ప్రభావంతో బంతిని మార్చడం, బంతిపై లాలాజలం రుద్దడం, రిటైర్డ్ ఔట్ నియమాలు యథావిధిగానే ఉండనున్నాయి.

అనంతరం ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోషూట్ జరిగింది. అలాగే కెప్టెన్లందరూ సరదాగా టెన్నిస్ బాల్ మ్యాచ్ ఆడి సందడి చేశారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.

Shane Warne : షేన్ వార్న్ ముందుచూపు…కుటుంబానికి రూ.450 కోట్లు

Related Articles

Back to top button