IPL Schedule : 12 వేదికలు..50 మ్యాచ్ లు…ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ విడుదల
IPL Schedule : ఐపీఎల్ 19వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడంతో ఈ సారి ఐపీఎల్ షెడ్యూల్ విడుదల ఆలస్యమైంది
IPL Schedule
ఐపీఎల్ 19వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడంతో ఈ సారి ఐపీఎల్ షెడ్యూల్(IPL Schedule) విడుదల ఆలస్యమైంది. మార్చి రెండో వారంలో బీసీసీఐ మొదటి దశ షెడ్యూల్ ను ప్రకటించింది. 20 మ్యాచ్ ల వివరాలే వెల్లడించింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆయా రాష్ట్రాల పోలింగ్ , కౌంటింగ్ తేదీలు దృష్టిలో ఉంచుకుని రెండో దశ షెడ్యూల్ పై కసరత్తు చేసింది.
తాజాగా సెకండ్ ఫేజ్ షెడ్యూల్ ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం రెండో దశలో మొత్తం 50 మ్యాచ్ లు జరగనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకూ దేశవ్యాప్తంగా 12 వేదికలు ఐపీఎల్ కు ఆతిథ్యమివ్వనున్నాయి. తొలి దశలో 20 మ్యాచ్ లు, రెండో దశలో 50 మ్యాచ్ లు కలిపి లీగ్ స్టేజ్ లో మొత్తం 70 మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి. ప్లే ఆఫ్స్ షెడ్యూల్(IPL Schedule) ను తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది.

రెండో దశ వేదికలను చూస్తే బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్,ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ధర్మశాల, రాయపూర్, న్యూ చండీగఢ్ మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనున్నాయి. సెకండ్ ఫేజ్ షెడ్యూల్ లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. సెకండ్ ఫేజ్ లో 8 డబుల్ హెడర్ మ్యాచ్ లు ఉండగా..మధ్యాహ్నం మ్యాచ్ లు 3.30 గంటలకు మొదలవుతాయి.
రాత్రి మ్యాచ్ లు 7.30 గంటలకు ఆరంభం కానున్నాయి. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ తమ హోం మ్యాచ్ లను రెండు వేదికల్లో ఆడనుంది. న్యూ ఛంఢీఘడ్, ధర్మశాలలో పంజాబ్ మ్యాచ్ లు ఆడుతుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ 4 హోం మ్యాచ్ లను జైపూర్ లో ఆడనుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోం మ్యాచ్ లను చిన్నస్వామి స్టేడియంతో పాటు రాయ్ పూర్ లో ఆడేందుకు ప్లాన్ చేసుకుంది.
🚨 News 🚨
BCCI announces schedule for second phase of #TATAIPL 2026 🗓️
The remainder of the league stage, comprising 50 matches, will be played from April 13 to May 24, 2026, across 12 venues in India 🏟️
More details 🔽https://t.co/iYGnB0Gd2J
— IndianPremierLeague (@IPL) March 26, 2026
Biryani : బిర్యానీ-కూల్ డ్రింక్ కాంబినేషన్..కలిపి తీసుకుంటే అంతే సంగతులు





