Just SportsLatest News

Kavya Maran and Anirudh: అనిరుధ్ తో కావ్యా పాప పెళ్లి ?…తమిళ మీడియాలో ప్రచారం

Kavya Maran and Anirudh : ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు కావ్యా మారన్... ఫ్రాంచైజీ కో ఓనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మ్యాచ్ సమయంలో స్టేడియంలో చేసే హంగామా అంతా ఇంతా కాదు

Kavya Maran and Anirudh

ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు కావ్యా మారన్… ఫ్రాంచైజీ కో ఓనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మ్యాచ్ సమయంలో స్టేడియంలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. కెమెరాల ఫోకస్ అంతా ఆమె పైనే ఉంటుంది. తాజాగా కావ్యా మారన్ మరోసారి వార్తల్లో నిలిచింది.

ఐపీఎల్ 19వ సీజన్ ముంగిట ఆమె పెళ్లి టాపిక్ వైరల్ గా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను త్వరలోనే ఆమె వివాహం చేసుకోబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పైగా ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు మీడియాలో వీరిద్దరి వివాహం గురించి జోరుగా కథనాలు వచ్చాయి. నిజానికి గత కొంతకాలంగా అనిరుధ్, కావ్యా మారన్ మధ్య ఏదో ఉందంటూ పుకార్లు వచ్చాయి.

ఇద్దరూ పలు సందర్భాల్లో విదేశాల్లో కనిపించడం, సన్ రైజర్స్ టీమ్ కు అనిరుధ్(Kavya Maran and Anirudh) థీమ్ సాంగ్ కంపోజ్ చేయడం వంటివి దీనికి బలం చేకూర్చాయి. గతంలో అనిరుధ్ టీమ్ ఈ వార్తలను ఖండించింది. అయితే తాజాగా తమిళనాడు మీడియాలో మాత్రం వీరిద్దరి పెళ్లి టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. అనిరుధ్, కావ్యా మారన్ వివాహానికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Kavya Maran and Anirudh
Kavya Maran and Anirudh

కావ్యా మారన్ తండ్రి, సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుటుంబంతో అనిరుధ్‌కు పాత పరిచయాలు ఉండడం కూడా వీరిద్దరి స్నేహం ప్రేమగా మారిందన్న ప్రచారం కూడా ఉంది. తాజాగా తమిళ మీడియాలో మరిన్ని వార్తలు రావడంతో త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతానికైతే ఈ పెళ్లి వార్తలపై కావ్యా మారన్, అనిరుధ్(Kavya Maran and Anirudh) ఇద్దరూ స్పందించలేదు. సెలబ్రిటీల గురించి ఇలాంటి పుకార్లు రావడం కామనే కానీ తమిళనాడు ప్రముఖ మీడియా సంస్థలు ఈ వార్తలను ప్రముఖంగా ప్రచురించడంతో దాదాపుగా నిజమేనని చెబుతున్నారు.

ప్రస్తుతం అనిరుధ్ పాన్ ఇండియా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ తీరిక లేకుండా ఉన్నాడు. అటు కావ్యా మారన్ ఐపీఎల్ 2026 సీజన్ తో బిజీగా ఉంది. మరి క్రికెట్, మ్యూజిక్ కాంబినేషన్ పెళ్లి వరకూ వెళుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Rose Water : అందం కోసం రోజ్ వాటర్…మీ చర్మాన్ని మీరే పాడుచేసుకోకండి

Related Articles

Back to top button