MI : దంచికొట్టిన రోహిత్, రికెల్టన్…ముంబై చేతిలో కేకేఆర్ చిత్తు
MI : ఐపీఎల్ చరిత్రలో తొలి మ్యాచ్ లో ఓటమి సెంటిెమెంట్ ను ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బ్రేక్ చేసింది. వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ, రికెల్టన్ సృష్టించిన విధ్వంసంతో కోల్ కత్తాను చిత్తుగా ఓడించింది
MI
ఐపీఎల్ చరిత్రలో తొలి మ్యాచ్ లో ఓటమి సెంటిెమెంట్ ను ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బ్రేక్ చేసింది. వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ, రికెల్టన్ సృష్టించిన విధ్వంసంతో కోల్ కత్తాను చిత్తుగా ఓడించింది. తద్వారా 13 ఏళ్ల తర్వాత సీజన్ తొలి మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్(MI) బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడే స్టేడియంలో ఛేజింగ్ జట్టుకే అవకాశాలుండడమే దీనికి కారణం. సూర్యకుమార్ యాదవ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపుతూ ముంబై సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు ఓపెనర్లు రహానే, ఫిన్ అలెన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.
తొలి వికెట్ కు 5.2 ఓవర్లలోనే 69 పరుగులు జోడించారు. అలెన్ 37( 17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) , రూ.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన క్రిస్ గ్రీన్ (17) ఫెయిలయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రహానే మాత్రం దుమ్మురేపాడు. తనపై ఉన్న టెస్ట్ ప్లేయర్ ముద్రను చెరిపేస్తూ సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. రహానే 40 బంతుల్లో 67 ( 3 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేశాడు.
రహానే దూకుడుగా ఆడే క్రమంలో ఔటవగా.. రఘువంశీ మెరుపు బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. కేవలం 29 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసాడు. అటు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ దక్కించుకున్న రింకూ సింగ్(33) చివర్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఫలితంగా కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో శార్థూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు.
భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ రెచ్చిపోయి ఆడారు. వాంఖడేలో పరుగుల సునామీ వచ్చిందా అన్న రీతిలో చెలరేగిపోయారు. వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లు బాదేస్తుంటే కోల్ కతా బౌలర్లకు దిక్కుతోచలేదు. చూస్తుండగానే పవర్ ప్లేలో 80 పరుగులు చేసిన ముంబై తర్వాత మరింత దూకుడుగా సాగింది.

రికెల్టన్, రోహిత్ సిక్సర్లు బాదేందుకు పోటీపడ్డారంటే ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరినీ కట్టడి చేయడంలో కేకేఆర్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. రికెల్టన్, రోహిత్ తొలి వికెట్ కు 148 పరుగులు జోడించగా.. అప్పటికే ముంబై విజయం ఖాయమైపోయింది. రోహిత్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి ఔటయ్యాడు.
అటు రికెల్టన్ 81 ( 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు) రన్స్ కు పెవిలియన్ చేరుకున్నాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ (16), తిలక్ వర్మ (20) పరుగులకు ఔటవగా…హార్థిక్ పాండ్యా , నమన్ ధీర్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ముంబై ఇండియన్స్(MI) మరో 5 బంతులు మిగిలుండగా టార్గెట్ ను అందుకుంది.
Kohli : ఇదిరా కింగ్ కోహ్లీ అంటే..చిన్నస్వామిలో కళాత్మక విధ్వంసం





