Just BusinessLatest News

Gold : రికార్డు స్థాయిల వద్దే స్థిరంగా పుత్తడి.. రూ. 2.5 లక్షలు దాటిన వెండి

Gold : అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు, మారుతున్న ఆర్థిక సమీకరణాల నడుమ పసిడి ధరలు రోజుకో రకంగా సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి

Gold

అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు, మారుతున్న ఆర్థిక సమీకరణాల నడుమ పసిడి(Gold) ధరలు రోజుకో రకంగా సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కొద్ది రోజులుగా భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న గోల్డ్ మార్కెట్, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం రోజు అత్యంత గరిష్ట స్థాయిల వద్దే స్థిరంగా కొనసాగుతోంది.

ప్రపంచ మార్కెట్లో డాలర్ బలపడటంతో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల మదుపర్లు పసిడి(Gold) వైపు మొగ్గు చూపుతుండటంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ ,విశాఖపట్నంలో ధరల ట్రెండ్ ఒకేలా కనిపిస్తోంది. ప్రస్తుత బంగారం మార్కెట్ వివరాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర రూ. 1,52,450 వద్ద ట్రేడ్ అవుతోంది.

అదేవిధంగా జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,39,740 గా నమోదైంది. కేవలం మన రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ముంబై, బెంగళూరు , కోల్‌కతా నగరాల్లో కూడా 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1,52,450 వద్ద స్థిరంగా ఉంది. అయితే ఢిల్లీలో మాత్రం స్వల్ప వ్యత్యాసంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ. 1,52,600 కు చేరింది. దక్షిణాన చెన్నైలో ఎక్కువగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,53,370 గా ఉంది.

Gold
Gold

ఇటు పసిడితో పోటీ పడుతూ వెండి ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేనంతగా ఎగబాకాయి. పసిడి ధరలు నిలకడగా ఉన్నా సరే, వెండి మాత్రం ప్రస్తుతం నేలచూపులు చూస్తూ కొంచెం దిగివస్తోంది. అయినా సరే కిలో వెండి ధర మాత్రం సామాన్యులకు అందనంత దూరంగా భారీ ధరే పలుకుతోంది.

దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ఒక గ్రాము వెండి ధర రూ. 259.90 పలుకుతుండగా, కిలో వెండి ధర రూ. 2,59,900 లుగా పలుకుతోంది. శుభకార్యాల సీజన్ కావడంతో ఈ స్థాయిలో ధరలు ఉండటం కొనుగోలుదారులపై భారాన్ని మోపుతోంది.

Urine: మీ ఆరోగ్యం ఏంటో మీ మూత్రం రంగు చెబుతుంది.. ఏ కలర్ దేనికి సంకేతమో తెలుసా?

Related Articles

Back to top button