Just Andhra PradeshJust PoliticalLatest News

Lokesh:విమర్శల నుంచి విజయ శిఖరాల వరకూ..ఇదీ లోకేష్ అసలు మార్క్!

Lokesh: టికెట్ల కేటాయింపులో ఎలాంటి మొహమాటాలకు పోకుండా, కేవలం వారివారి పనితీరు ఆధారంగానే కొత్త ముఖాలకు అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో యువ రక్తాన్ని నింపారన్న పేరు సంపాదించారు.

Lokesh

ఒకప్పుడు పప్పు అని ఎగతాళి చేసిన నోళ్లే, ఇప్పుడు నిప్పు లాంటి నాయకుడని నారా లోకేష్‌ను కీర్తిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్‌ను చూసినవారంతా రాజకీయాల్లో విమర్శలను ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, ఆ విమర్శలనే తన విజయానికి ఇంధనంగా మార్చుకుని చంద్రబాబుకు తగ్గ తనయుడిగా.. కాదు కాదు తండ్రిని మించిన తనయుడిగా ఎదగడం మరో ఎత్తు అంటున్నారు.

అవును అక్షరాలా ఇది నిజం . ఎందుకంటే నారా లోకేష్(Lokesh) ప్రయాణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ ఒక సరికొత్త పాఠం అయింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కట్టుదిట్టమైన క్రమశిక్షణ, స్ట్రాటజీలకు.. లోకేష్ తనదైన వేగం, ఆధునిక ఆలోచనలు జోడించి పార్టీని ఏ విధంగా సంస్కరించారో చూస్తే, లోకేష్‌కు దక్కుతున్న ఈ గుర్తింపు వెనుక ఏళ్ల తరబడి పడ్డ కష్టం అందరికీ కనిపిస్తుంది. ఒకప్పుడు వైసీపీ నేతలు విమర్శలు చేయాలంటే ప్రధాన అస్త్రం లోకేష్ అయ్యేవారు. కానీ ఇప్పుడు లోకేష్‌ పేరును టచ్ చేయాలన్నా కూడా వెయ్యిసార్లు ఆలోచించే స్థాయికి చేరుకున్నారు.

నిజానికి లోకేష్‌(Lokesh)ను ఇలా అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం ఆయన చేపట్టిన పాదయాత్రే. ఏసీ రూముల్లో కూర్చుని రాజకీయాలు చేయడానికే లోకేష్ పనికి వస్తారన్న విమర్శలకు తన పాదయాత్రతోనే సమాధానం ఇచ్చారు. యువగళం పాదయాత్రలో వేలాది మైళ్లు నడవడమే కాదు..మండుటెండలో సామాన్యుడితో కలిసి భోజనాలు చేయడం,వారితో మమేకమవుతూ వారి కష్టాలను డైరీలో రాసుకున్న తీరు ఏపీ ప్రజలకు ఆయనను చాలా అంటే చాలా దగ్గర చేసింది.

ముఖ్యంగా యువతతో లోకేష్ మాట్లాడే తీరు, వారి సమస్యలపై చూపించిన క్లారిటీతో.. లోకేష్ ఒక తండ్రి చాటు బిడ్డ కాదని..ఒక పరిణతి చెందిన నాయకుడు అని అందరికీ పరిచయం చేసింది. ఆ సమయంలో లోకేష్‌ను అడ్డుకున్నా, ఆయనపై ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా ఎదురుదాడి చేసిన విధానం ఇటు కేడర్‌లోనూ నూతన ఉత్తేజాన్ని నింపిందనే చెప్పొచ్చు.

ఇక ఎన్నికల నిర్వహణలో నారా లోకేష్ చూపిన చాకచక్యం అమోఘం అని తెలుగు తమ్ముళ్లు మురిసిపోతుంటారు. నారా చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న గడ్డు సమయంలో, లోకేష్ ఒక్కరే ఢిల్లీ వెళ్లి హస్తిన వేదికగా దేశవ్యాప్త మద్దతును కూడగట్టి నేషనల్ మీడియా చూపును కూడా తన వైపు తిప్పుకున్నారు. పవన్‌ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి వచ్చినపుడు అందివచ్చిన అవకాశాన్ని ఏమాత్రం జారవిడుచుకోవడానికి ప్రయత్నించలేదు. అన్నయ్యా అంటూ పవన్‌కు పెద్దరికాన్ని ఇచ్చి పవన్ మద్దతుదారుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నారు.

అంతెందుకు పార్టీ కుప్పకూలిపోతుందేమో అన్న భయంలో ఉన్న కేడర్‌కు..చంద్రబాబు లేని లోటు తెలియకుండా అండగా నిలబడ్డారు. టికెట్ల కేటాయింపులో ఎలాంటి మొహమాటాలకు పోకుండా, కేవలం వారివారి పనితీరు ఆధారంగానే కొత్త ముఖాలకు అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో యువ రక్తాన్ని నింపారన్న పేరు సంపాదించారు.

Lokesh
Lokesh

ఇది పార్టీని తెలీకుండానే లోపలి నుంచి బలోపేతం చేసింది. గతంలో ఏ లీడర్ కూడా చేయని విధంగా, పార్టీ కోసం కష్టపడిన సామాన్య కార్యకర్తలను కూడా పొలిట్ బ్యూరో వంటి అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడమే కాకుండా వారికి పదవులు ఇచ్చి పదునైన పొలిటికల్ లీడర్‌గా మారారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్నాక కూడా లోకేష్ తన శైలిని మార్చుకోలేదు. విదేశీ కంపెనీలను ఏపీకి రప్పించడం ద్వారా ఐటీతో పాటు ఉపాధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నారు. ఇటు పాలనను పరుగులెత్తిస్తూనే, అటు పార్టీలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ఆయనే డైరెక్టుగా స్పందిస్తూ ఒక భరోసాను నింపుతున్నారు. కేవలం చంద్రబాబు వారసుడిగానే కాకుండా, తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ను నిర్మించుకోవడంలో లోకేష్ వంద శాతం విజయాన్ని సాధించారు.

సీనియర్ల సలహాలను స్వీకరిస్తారన్న నమ్మకం,అలాగే జూనియర్ల దూకుడును కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్ తీరు..తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన భరోసాను ఇస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో టీడీపీని కొత్త పుంతలు తొక్కించబోయే యువనాయకుడిగా నారా లోకేష్ ప్రస్థానం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.

Nara Lokesh : చంద్రబాబు సంచలన నిర్ణయం…టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా లోకేశ్

Related Articles

Back to top button