Latest News

Cousin Bonds : మళ్లీ చిగురించాల్సిన కజిన్స్ అనుబంధాలు.. దీనికోసం ఏం చేయాలి?

Cousin Bonds : ఒకప్పుడు ఎక్కువగా కనిపించే ఉమ్మడి కుటుంబాలు మెల్లమెల్లగా కనుమరుగు అయిపోయాయి. అయితే ఉమ్మడి కుటుంబాలలో ఉండే ప్రేమ, ఆప్యాయతలే వేరు అంటారు ఆనాటి వారు

Cousin Bonds

ఒకప్పుడు ఎక్కువగా కనిపించే ఉమ్మడి కుటుంబాలు మెల్లమెల్లగా కనుమరుగు అయిపోయాయి. అయితే ఉమ్మడి కుటుంబాలలో ఉండే ప్రేమ, ఆప్యాయతలే వేరు అంటారు ఆనాటి వారు. ముఖ్యంగా పెద్దమ్మ-పెదనాన్న, పిన్ని-బాబాయి, మేనత్త, మేనమామల పిల్లలతో కలిసి ఆడుకోవడం, ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకోవడం ఇలా కజిన్స్‌తో(Cousin Bonds) ఉండే మధురానుభూతులు ఎప్పటికీ ప్రత్యేకమేనని చెబుతుంటారు.

తోడబుట్టిన వాళ్లతో ఎంత ప్రేమగా ఉండేవాళ్లో, కజిన్స్‌తో(Cousin Bonds)నూ అలాగే ఉండేవారు. కానీ ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతుండటంతో అటువంటి ప్రేమలు, అభిమానాలు కూడా క్రమంగా దూరమవుతున్నాయి. అయితే ఈ అనుబంధాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, కజిన్స్‌తో బంధాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని నిపుణులు చెబుతున్నారు. కజిన్స్ ఎంత దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలగడానికి టెక్నాలజీ సాయాన్ని తీసుకోవాలి అంటున్నారు.

నిజానికి ఇప్పుడు మనల్నందరినీ కలిపి ఉంచడంలో మొబైల్స్ రోల్ ఏమాత్రం తక్కువ కాదు. అందుకే అందరికీ కుదిరేలా ఒక రోజును, లేదా ఒక సమయాన్ని కేటాయించుకుని వీడియో కాల్స్ చేసుకోవడమో లేదంటే గ్రూప్ కాల్ మాట్లాడుకోవడమో చేయడం వల్ల ఎంత దూరంలో ఉన్నా దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి విడిగా కాకుండా గ్రూప్ కాల్ చేయడం వల్ల వారంతా ఒకే చోట ఉన్న ఫీల్ వస్తుంది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం.

వీరంతా కలిసి ఒక గ్రూపు క్రియేట్ చేసుకుని రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేలా చూసుకోవాలి. వాట్సప్ గ్రూపుల్లో వేసే సెటైర్లు, టీజింగ్‌లు చూడడానికి చిన్నవిగా అనిపించినా, అవే వారి అనుబంధాన్ని శాశ్వతం చేస్తాయి. పెద్ద వాళ్ల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా అవి కజిన్స్ మధ్యకు రాకుండా జాగ్రత్త పడుతూ కుటుంబాలను కలిపే వారధులుగా మారాలి.

ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలోనే కాకుండా, కేవలం కజిన్స్ మాత్రమే గెట్-టు-గెదర్ పార్టీలు ఏర్పాటు చేసుకునేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. అందరికీ అనువైన ఒక ప్రదేశాన్ని ఎంచుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా గడిపేలా చేసుకోవాలి.

Cousin Bonds
Cousin Bonds

అంతేకాదు ఏ బంధం అయినా సరే సుఖాల్లో మాత్రమే కాదు, కష్టాల్లో కూడా తోడున్నప్పుడే అది దృఢమవుతుంది. కజిన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండటం వల్ల ఒకరి సమస్యలు మరొకరికి తెలుస్తాయి. వారు డెరెక్టుగా చెప్పలేకపోయినా వేరే వారి ద్వారా తెలిసినప్పుడు వెంటనే స్పందించి సహాయపడితే ఆ బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది.

కష్టాల్లో గట్టెక్కేలా సలహాలివ్వడం వల్ల ఇద్దరి మధ్య నమ్మకం బాగా పెరుగుతుంది. అలాగే ప్రత్యేక సందర్భాల్లో విష్ చేసుకోవడం, కానుకలతో సర్​ప్రైజ్ చేసుకోవడం, వీలున్నప్పుడు కలిసి ట్రిప్స్‌కు వెళ్లడం వంటివి చేయాలి. ఇలాంటివి ఫాలో అయితే కజిన్స్ మధ్య అనుబంధం ఎప్పటికీ మసకబారకుండా ఉంటుంది. మొత్తంగా మారుతున్న కాలంలో బంధుత్వాలను కాపాడుకోవడం మన బాధ్యత అని అందరికీ తెలిసేలా చేయాలి.

Strait of Hormuz : హార్మూజ్ జలసంధి తెరిచిన ఇరాన్..ధన్యవాదాలు చెప్పిన ట్రంప్

Related Articles

Back to top button