Just PoliticalJust NationalLatest News

TVK Vijay : వ్యూహాలకు పదును పెట్టిన విజయ్..టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల

TVK Vijay : త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కువమంది చూపు తమిళనాడుపైనే ఉంది. ఎందుకంటే ఈ సారి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరగబోతోంది

TVK Vijay

త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కువమంది చూపు తమిళనాడుపైనే ఉంది. ఎందుకంటే ఈ సారి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరగబోతోంది. డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు నటుడు విజయ్ టీవీకే(TVK Vijay) పార్టీ కూడా ఇక్కడ పోటీలో ఉంది. విజయ్ ఎంట్రీతో తమిళనాడు పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. తమిళనాట హీరోల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయాల్లోనూ అదరగొట్టాలని ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో జననాయగన్ సినిమాతో వెండితెరకు వీడ్కోలు పలికి పూర్తిగా పాలిటిక్స్ లోనే బిజీగా ఉన్నారు. గత ఏడాది విజయ్ పార్టీ మీటింగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన దళపతిని కాస్త ఇబ్బంది పెట్టినా త్వరగానే కోలుకుని పొలిటికల్ గా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడడంతో దళపతి విజయ్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. తాజాగా తన తమిళగ వెట్రి కజగం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

టీవీకే చీఫ్ విజయ్(TVK Vijay) రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్టు పార్టీ వెల్లడించింది. చెన్నైలోని పెరంబూరు, కీలకమైన తిరుచ్చి ఈస్ట్ నియోజక వర్గాల నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాలు తమిళనాడులో కీలకమైన స్థానాలుగా చెబుతుంటారు.

ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లోనూ అధికార డీఎంకే పార్టీ బలంగా ఉండడంతో విజయ్ ఎలాంటి వ్యూహాలతో వారిని ఓడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బాగా ఆలోచించే ఈ స్థానాలను దళపతి ఎంపిక చేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీఏంకే బలంగా ఉన్న చోటు నుంచే గెలిచి తన స్టామినా ఏంటో చాటిచెప్పాలని విజయ్ పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు.

కాగా తన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సందర్భంగా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ తరపున ఎన్నికల్లో నిలబడుతున్న వారంతా కొత్తవారేనని, వీరిని ప్రజల రక్షకులుగా తాను చూస్తున్నట్టు చెప్పారు. అందరూ సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వారేనని, అవినీతి మరకలు లేనివారని గుర్తు చేశారు.

TVK Vijay
TVK Vijay

తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను కోరారు. తన పార్టీ గుర్తు విజిల్ విప్లవం రాబోతుందంటూ వ్యాఖ్యానించారు. టీవీకే అభ్యర్థుల ఎంపిక విషయంలో విజయ్ పూర్తి వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్టు చెబుతున్నారు. పలు చోట్ల అధికార డీఎంకే కీలక నేతలపై టీవీకేలో చురుగ్గా వ్యవహరిస్తున్న వారినే దించారు.

సీఎం ఎంకే స్టాలిన్ కొలత్తూర్ నియోజక వర్గంలో టీవీకే తరపున వి.ఎస్. బాబును బరిలోకి దింపారు. అలాగే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై చెపాక్ నియోజక వర్గంలో కాంగ్రెస్ మాజీ నేత సెల్వంకు విజయ్ అవకాశమిచ్చారు.మొత్తం మీద అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీలో అంతర్గతంగా చర్చించి ఖరారు చేసారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.

Kohli : ఇదిరా కింగ్ కోహ్లీ అంటే..చిన్నస్వామిలో కళాత్మక విధ్వంసం

Related Articles

Back to top button